జగన్‌కు షాక్: రాజ్యసభ ఎన్నికలే టార్గెట్, పాదయాత్రపై బాబు ప్లాన్ ఇదే
అమరావతి:వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు షాకిచ్చేలా టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహరచన చేస్తున్నారు..జగన్ పాదయాత్ర నిర్వహించే జిల్లాల నుండే వలసలను ప్రోత్సహించేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.రానున్న రోజుల్లో వైసీపీ నుండి ఇంకా పెద్ద సంఖ్యలో వలసలు ఉండే అవకాశం ఉందని టిడిపి వర్గాలు అభిప్రాపడుతున్నాయి.
2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మేరకు పాదయాత్రను జగన్ లక్ష్యంగా ఎంచుకొన్నారు. నవంబర్ 2వ, తేది నుండి జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు.
కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురం వరకు పాదయాత్ర చేయాలని వైసీపీ చీఫ్ జగన్ ప్లాన్ చేశారు. పాదయాత్ర ఏర్పాట్లపై జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

వైఎస్ జగన్‌కు బాబు చెక్
నవంబర్ రెండవ తేది నుండి వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే పాదయాత్ర సుదీర్ఘంగా నిర్వహించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎస్ జగన్ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. అయితే అదే సమయంలో జగన్‌కు వ్యూహనికి చెక్ పెట్టేలా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జగన్ ఏ జిల్లాలో పాదయాత్ర చేస్తారో.. అదే జిల్లా నుండి వైసీపీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులను టిడిపిలో చేరేలా ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోందని తెలుగుతమ్ముళ్ళు చెబుతున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో జగన్‌కు షాకిస్తారా?
2018 మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర శాసనసభలో తమ పార్టీకి ఉన్న బలం ఆధారంగా ఒక్క సీటును గెలుచుకొనే అవకాశం వైసీపీకి ఉంది. అయితే ఆ ఒక్క సీటును కూడ గెలుచుకోకుండా ఉండేలా టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకొనేలా టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

పాదయాత్ర ప్రారంభమైన 6 రోజులకే అసెంబ్లీ
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించిన ఆరురోజులకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హజరుకాకపోవచ్చు. పాదయాత్ర సాగుతున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాలకు జగన్ దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడ పాదయాత్రలో ఉన్న సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాబు పాల్గొనలేదు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా
నిర్ణీత సమయానికి కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు కూడ సానుకూలంగా ఉన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. వైసీపీ చీఫ్ జగన్ కూడ తమ పార్టీ నేతలకు ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ముందస్తు ఎన్నికలు జరిగితే తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565











Click it and Unblock the Notifications