పవన్ విజ్ఞత, లోకేష్ భేష్: బాబు ఆనందం, టి నేతలకు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం మహనాడు ముగింపు సభలో తన తనయుడు నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. ఇద్దరి పైన ప్రశంసల వర్షం కురిపించారు. రెండు రోజుల పాటు జరిగిన మహానాడు బుధవారం ముగిసింది. ముగింపు సభలో చంద్రబాబు మాట్లాడారు.
తెలుగు జాతి ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపి, టిడిపి కూటమికి సహకరించారని గుర్తు చేశారు. కాంగ్రెసు వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఆయన విజ్ఞతకు ఆయనకు తాను అభినందనలు తెలుపుతున్నానన్నారు. పవన్ పార్టీ పెట్టి కూడా పోటీ చేయక పోవడాన్ని బాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి, టిడిపి కూటమి గెలిచేందుకు పవన్ తోడ్పడ్డారన్నారు.

అదే సమయంలో నారా లోకేష్ పైన ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నిధి ఉండాలనే లోకేష్ ఆలోచన చాలా బాగుందని కితాబిచ్చారు. తెలంగాణ టిడిపి నేతల పైన కూడా చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు మహానాడు వేదికగా తెలంగాణ టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిల పేర్లను ప్రస్తావించారు. ఎర్రబెల్లి మహానాడులో ఎన్నో విషయాలు చెప్పారని, మోత్కుపల్లి తెలంగాణలో ఒంటరి పోరు చేశారని, రేవంత్ టిడిపిన విశ్వవిద్యాలయంగా చెప్పారని కితాబిచ్చారు.
కాగా, అభివృద్ధితోనే సంపద సాధ్యమని చంద్రబాబు చెప్పారు. సమైక్యాంధ్ర కోసం, తెలంగాణ కోసం ఇరు ప్రాంతాల్లో ఉద్యమించిన వారి పైన కేసులు ఎత్తి వేయాల్సిన అవసరముందన్నారు. సీమాంధ్రలో తాము కేసులు ఎత్తివేస్తామని, తెలంగాణలో తెరాస ప్రభుత్వం కేసులు ఎత్తివేసి, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు.












Click it and Unblock the Notifications