హరికృష్ణ మృతిని నేటికీ నమ్మలేకపోతున్నా, మాటిస్తున్నా: బాబు, వైయస్ వర్ధంతిపై ట్వీట్
విజయవాడ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తమ తమ ట్విట్టర్ అకౌంట్ల నుంచి ట్వీట్ చేశారు.
'మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నానని, ఆయన మార్గదర్శకం తనకు ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన బావమరిది నందమూరి హరికృష్ణను మరోసారి గుర్తు చేసుకున్నారు.
'చైతన్య రథసారథి, నా ఆత్మీయుడు నందమూరి హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేడు తన జయంతి సందర్భంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా.. టిడిపి కార్యకర్తల్లో హరి నింపిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాను.' అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ఈ రోజు హరికృష్ణ జయంతి కూడా.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications