ఆరేళ్ళ మనవరాలితో కారు డ్రైవింగ్ చేయించిన ఎస్సై వీడియో వైరల్, కట్ చేస్తే...

చిన్నారులతో డ్రైవింగ్ చేయించకూడదు అని ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా, మళ్ళీ చిన్నారులతో డ్రైవింగ్ చేయిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ నియమాలు బాగా తెలిసిన పోలీసులే చిన్నారులతో డ్రైవింగ్ చేయిస్తుంటే, అందులోనూ ఆరేళ్ళ చిన్నారితో కారు డ్రైవింగ్ చేయిస్తుంటే ఇలాంటి ఘటనలు సమాజాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి.

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన

తాజాగా హైదరాబాద్ లో ఒక పోలీస్ అధికారి తన ఆరున్నరేళ్ల మనవరాలికి రద్దీగా ఉన్న మెయిన్ రోడ్ పై కారు డ్రైవింగ్ నేర్పించటం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ ఘటనపైన స్థానికులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు ఎస్సైపైన కేసు నమోదయింది. ఈ ఘటన వివరాలలోకి వెళితే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.

SI booked in minor driving case video viral his six-and-a-half-year-old granddaughter driving car

కార్ డ్రైవింగ్ సీట్లో ఆరున్నరేళ్ళ మనవరాలితో డ్రైవింగ్ చేయించిన ఎస్సై

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ పూజారి తిరుపతి తన ఆరున్నరేళ్ళ మనవరాలిని కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి స్టీరింగ్ ఇచ్చి కారు నడపడం నేర్పించారు. రద్దీగా ఉన్న రోడ్డు పైన చిన్న పాప కారు నడపటం చూసిన స్థానికులు, తోటి వాహనదారులు ఆందోళనకు లోనయ్యారు. వెంటనే కారుని అడ్డుకొని లోపల ఉన్న ఎస్ఐ ని నిలదీశారు.

చిన్నారి మా తాత ఎస్సై తెలుసా అంటూ ప్రశ్న

ఇంత రద్దీలో చిన్నారి కారు నడపడం దేనికి? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికి బాధ్యత అంటూ ఆయనను గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఎస్ఐ తిరుపతి తన తప్పును సమర్ధించుకుంటూ, ఇది ఆటోమేటిక్ కాదు కంట్రోల్ అంతా నా చేతుల్లోనే ఉంది. ప్రమాదం ఏమీ జరగదు అంటూ వాదించారు. అయితే అంతలో డ్రైవింగ్ సీట్లో ఉన్న చిన్నారి మా తాత ఎస్సై తెలుసా అంటే అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ మాట్లాడింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఎస్సైపై కేసు

ఈ సంఘటన స్థానికులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఘటన సమయంలో కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో హైదరాబాద్ పోలీసులు అధికారులు స్పందించి సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకున్నారు. నార్సింగి పోలీసులు ఎస్ఐ పూజారి తిరుపతిపైన మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+