Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ర్యాంక్ చూసి షాకయ్యా: బాబు, ఇదీ విషయం, ఆ ఎమ్మెల్యేలకు షాక్, వేరే అభ్యర్థులు?

సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీకి పదిహేనవ ర్యాంకు వచ్చిందన్న మీడియా వార్తలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు.

అమరావతి: సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీకి పదిహేనవ ర్యాంకు వచ్చిందన్న మీడియా వార్తలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు.

Recommended Video

    బాబు జోక్స్ కి అవాక్కయిన ఎమ్మెల్యేలు Chandrababu Making Fun With MLAs | Oneindia Telugu

    ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌లో తుది ర్యాంకులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ముగియక ముందే రాష్ట్రానికి 15వ ర్యాంకు వచ్చినట్టుగా వచ్చిన వార్తను చూసి విస్మయం చెందానని చంద్రబాబు అన్నారు.

     ఆ వార్త చూసి షాకయ్యా

    ఆ వార్త చూసి షాకయ్యా

    పత్రికలో వార్త చూసి తాను షాకయ్యానని, ఎందుకు ఇలా వచ్చిందో ఒక్క నిమిషం తనకు ఏమీ అర్ధం కాలేదని, వెంటనే పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని చంద్రబాబు చెప్పారు.

     నా పరిస్థితే ఇలా ఉంది, జనాలు ఎలా

    నా పరిస్థితే ఇలా ఉంది, జనాలు ఎలా

    నా పరిస్థితే అలా ఉంటే, సామాన్య ప్రజలు ఆ వార్తను చదివి నిజమే అనుకుంటారు కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియా అత్యుత్సాహం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి కూడా మన రాష్ట్రం మంచి ర్యాంకులో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

     ఇదీ అసలు విషయం!

    ఇదీ అసలు విషయం!

    ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తుది ర్యాంకులు రావడానికి డిసెంబరు నెలాఖరు వరకు సమయం పడుతుందని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు తెలిపారు. తుది ర్యాంకులు ప్రకటించే వరకు అప్పటికి అప్‌లోడ్‌ చేసిన వివరాల్ని బట్టి రాష్ట్రాల స్థానాలు మారుతూ ఉంటాయన్నారు. తుది ర్యాంకులనే పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

     నిత్యం పోటీ ఉంటుంది

    నిత్యం పోటీ ఉంటుంది

    ఇందుకు చంద్రబాబు మాట్లాడుతూ.. ఏదేమైనా నిత్యం పోటీ ఉంటుందని, మనమే తెలివైన వాళ్లమనుకుంటే సరిపోదని, అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉంటున్నాయని, పోటీ పడుతున్నాయని, ఎప్పటికప్పుడు మరింత తెలివిగా, సమర్థంగా వ్యవహరించాలన్నారు.

     అభ్యర్థుల్ని మార్చమంటారా, అల్టిమేటం

    అభ్యర్థుల్ని మార్చమంటారా, అల్టిమేటం

    ఇదిలా ఉండగా, ఇంటింటికీ టీడీపీపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించని వారికి అక్షింతలూ చేసిన విషయం తెలిసిందే. ఇలా అయితే కష్టమని, మీరు మారతారా? లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ప్రత్యామ్నాయంగా వేరే అభ్యర్థుల్ని సూచిస్తారా, నన్ను సూచించమంటారా? తేల్చుకోమని నేతలకు అల్టిమేటం జారీ చేశారు.

     సమావేశాల బహిష్కరణ జగన్ సెల్ఫ్ గోల్

    సమావేశాల బహిష్కరణ జగన్ సెల్ఫ్ గోల్

    శాసన సభ సమావేశాలను బహిష్కరించాలని వైసిపి నిర్ణయించుకోవడం సెల్ఫ్ గోల్ అని మంత్రి అన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోదన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+