చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం టూర్లో అపశృతి: ఏపీ చరిత్రలో భారీ ఎన్‌కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో బుధవారం నాడు స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉన్న ఇద్దరు వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫరుకు ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. గాయపడిన జర్నలిస్టులను ఆసుపత్రికి తరలించారు. దీంతో సీఎం పర్యటనకు కొద్దిసేపు అవాంతరం ఏర్పడింది.

చట్టపరంగా వ్యవహరించాలి: చంద్రబాబు

సీఎం చంద్రబాబు మంగళవారం నాడు మంత్రులు, ఉన్నతాధికారులతో చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్‌కౌంటర్ పైన సమీక్ష నిర్వహించారు. చట్టపరంగా వ్యవహరించాలని కోరారు. ఎన్ కౌంటర్ పైన తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇది సునిశితంగా కనిపిస్తోంది.

శేషాచలం ఎన్ కౌంటర్ పైన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, గవర్నర్ నరసింహన్‌లకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు. సమీక్ష అనంతరం ఫోన్ చేసి వివరాలు తెలిపారు. స్మగ్లర్లు గతంలో అటవీ శాఖ అధికారులపై దాడి చేసి హతమార్చిన సంఘటనలను గుర్తు చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు శేషాచలం కొండల్లో జరిగిన ఎన్ కౌంటర్ పైన మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

శేషాచలం

శేషాచలం

శేషాచలం కొండల్లో మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. అటవీ శాఖ సిబ్బంది, పోలీసులపై దాడికి దిగి, రాళ్లు విసిరి, దొరికిన వాళ్లను చంపడానికి కూడా వెనుకాడని ఎర్ర చందనం స్మగ్లర్లకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మృతులంతా తమిళనాడుకు చెందిన వారే కావడంతో ఇది అంతర్‌ రాష్ట్ర వివాదంగా కూడా మారింది. అంతేకాదు ఏపీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారు. పలువురు పోలీసులు గాయపడ్డారు.

శేషాచలం

శేషాచలం

సోమవారం సాయంత్రం తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం నుంచి 45 మంది సాయుధ సిబ్బంది కూంబింగ్‌కు సిద్ధమయ్యారు. శేషాచలం అడవుల్లో రాకపోకల కోసం ఎర్ర స్మగ్లర్లు తాజాగా ఎంచుకున్న దారులను గుర్తించారు.

శేషాచలం

శేషాచలం

సోమవారం పొద్దు వాలాక శ్రీనివాస మంగాపురం సమీపంలో అడవిలోకి ప్రవేశించి... స్మగ్లర్లకోసం గాలింపు మొదలుపెట్టారు. శ్రీవారిమెట్టు నడకదారికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎర్రచందనం స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఆ ప్రాంతంపై దృష్టి సారించారు.

శేషాచలం

శేషాచలం

తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో మట్టిదారిలో పడిన కాలి గుర్తుల ఆధారంగా సచ్చినోడిబండ వైపు టాస్క్‌ఫోర్స్‌ వెళ్లింది. అదే దారిలో ఎర్రస్మగ్లర్లు సుమారు 40 మంది భుజాన ఎర్ర దుంగలతో కిందికి దిగుతున్నట్లుగా గుర్తించారు. వీరికి కింది నుంచి వస్తున్న ఇద్దరు పోలీసులు మాత్రమే కనిపించారు.

శేషాచలం

శేషాచలం

ఉన్నది ఇద్దరే కదా అని స్మగ్లర్లు తమదైన శైలిలో రాళ్లతో దాడికి దిగారు. పోలీసుల అరుపులతో మిగిలిన సాయుధ సిబ్బంది వేగంగా ముందుకు కదిలారు. ఒక్కసారిగా అంతమంది పోలీసులను చూడటంతో స్మగ్లర్లు మరింత రెచ్చిపోయారు. విచ్చలవిడిగా రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు తుపాకులకు పని చెప్పారు.

శేషాచలం

శేషాచలం

తమ రాష్ట్రానికి చెందిన 20మందిని దారుణంగా హతమార్చడంపై ఆంధ్ర సర్కార్‌పై తమిళనాడు నిప్పులు చెరిగింది. ఈమేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాశారు.

శేషాచలం

శేషాచలం

విశ్వసనీయ రీతిలో త్వరితగతిన దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గుదేల్చాలన్నారు. మరోపక్క సంఘటన ఆంధ్ర- తమిళనాడు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

శేషాచలం

శేషాచలం

ఆంధ్రకు చెందిన అనేక బస్సులపై దాడులు జరిగాయి. తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్ర ఎన్‌కౌంటర్‌పై నిప్పులు చెరిగాయి. మానవ హక్కుల సంఘం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. మీడియా కథనాలనే సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక కోరుతూ సిఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

English summary
Chandrababu Naidu Reviews on Seshachalam Encounter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X