కేబినెట్: ఏ జిల్లాలో ఎవరు ఇన్, ఎవరు ఔట్? వైసిపి నుంచి వీరే! ఎందుకంటే..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఏ జిల్లాలో ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరిని తప్పిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఆయా జిల్లాల్లో, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక వర్గాలు, మంత్రుల పని తీరు.. ఇలా ఎన్నో లెక్కలు వేసుకొని చంద్రబాబు కేబినెట్ విస్తరణకు తుదిరూపు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా పని చేయని మంత్రులపై వేటు వేయనున్నారు. చంద్రబాబు సహా ఇప్పుడు 20 మంది ఉన్నారు. 26 మంది దాకా కేబినెట్లో ఉండవచ్చు.

4గురిపై వేటు, 10 మందికి ఛాన్స్

ఏప్రిల్ 2వ తేదీన ఉదయం కొత్తగా పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అలాగే, నలుగురి నుంచి అయిదుగురిపై వేటు పడుతుందని అంటున్నారు. కొందరి శాఖలు మారుతాయని తెలుస్తోంది. కొందరు మంత్రులు శాఖలపై పట్టు పెంచుకోకపోవడంపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు.

వైసిపి నుంచి వచ్చిన వారికి ఎవరికి?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ఎంతమందికి అవకాశమిస్తారనే చర్చ సాగుతోంది. భూమా అఖిల ప్రియకు పదవి ఖాయంగా కనిపిస్తోంది. మైనార్టీ నేతల్లో జలీల్ ఖాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కడప జిల్లాలో పార్టీ బలం పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఆదినారాయణ రెడ్డి వంటి వారికి ఇస్తారని అంటున్నారు.

ఎవరిపై వేటు?

ఉత్తరాంధ్ర నుంచి ఒకరిపై, గుంటూరు నుంచి ఒకరిపై, సీమలోని కరువు జిల్లా నుంచి ఓ మంత్రిపై, అలాగే చిత్తూరు నుంచి మంత్రిపై వేటు పడనుందని ప్రచారం సాగుతోంది. మొత్తంగా నలుగురి నుంచి అయిదుగురిపై వేటు పడటం ఖాయమంటున్నారు.

కొత్తగా ఎవరికి ఛాన్స్?

ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావుకు పదవి దక్కనుంది. ఎమ్మల్సీగా ప్రమాణం చేసిన నారా లోకేష్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావులకు కేబినెట్లో చోటు దక్కుతుందని చెబుతున్నారు.

ఆయా జిల్లాలో.. ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్, చాంద్ పాషా, వంగలపూడి అనిత, జ్యోతుల నెహ్రూ, తోట, పార్థసారథి, పితాని సత్యనారాయణ, బోండా ఉమ, బుద్దా వెంకన్న, కాగితపు వెంకట్రావు, నక్కా ఆనంద రావు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, ఆలపాటి రాజేందర్, యరపతినేని, కోడెల శివప్రసాద రావు, దూలిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, అమర్నాథ్ రెడ్డి తదితరులు రేసులో ఉన్నారు. మండలి ఛైర్మన్‌ పదవికి శిల్పాచక్రపాణి రెడ్డి పేరు వినిపిస్తోంది.

కళాకు ఛాన్స్.. విశాఖలో ఒకరి శాఖ మారొచ్చు

కళాకు ఛాన్స్.. విశాఖలో ఒకరి శాఖ మారొచ్చు

శ్రీకాకుళం జిల్లా నుంచి.. కళా వెంకట్రావును కేబినెట్లోకి తీసుకోనున్నారు. అచ్చెన్నాయుడుకు ఎలాంటి ఢోకా లేదు. కళాను కేబినెట్లోకి తీసుకుంటే... ఏపీ టీడీపి అధ్యక్ష పదవి ఖాళీ అవుతుంది. ఆ స్థానంలో ఓ కాపు నేతకు అవకాశమిస్తారని తెలుస్తోంది.

రోజాతో ఢీ.. అనితకు అవకాశం దక్కేనా?

రోజాతో ఢీ.. అనితకు అవకాశం దక్కేనా?

విశాఖలో ఇద్దరు మంత్రుల్లో ఒకరి శాఖ మారనుందని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ధీటుగా ఎదుర్కొంటున్న వంగలపూడి అనితకు కేబినెట్లో ఛాన్స్ ఉండే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు.

విజయనగరంలో సుజయకు ఛాన్స్!.. బొత్సకు చెక్

విజయనగరంలో సుజయకు ఛాన్స్!.. బొత్సకు చెక్

విజయనగరం జిల్లా నుంచి కిమిటి మృణాళిని కేబినెట్‌లో కొనసాగించడం అనుమానంగా కనిపిస్తోంది. ఆమె స్థానంలో సుజయ కృష్ణ రంగారావుకు అవకాశం దక్కనుంది. సుజయ వైసిపి నుంచి వచ్చారు. వైసిపిలో బొత్స సత్యనారాయణ హవా పెరగడంతో ఆయన అలక వహించి టిడిపిలో చేరారు. బొత్సను మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు, ఇక్కడ పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంలో భాగంగా సుజయను కేబినెట్లోకి తీసుకుంటున్నారు.

రేసులో జ్యోతుల నెహ్రూ

రేసులో జ్యోతుల నెహ్రూ

తూర్పు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడుకు డోకా లేదు. అలాగే, తోట, జ్యోతుల నెహ్రూలు రేసులో ఉన్నారు.

పీతల సుజాత డౌట్

పీతల సుజాత డౌట్

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతల సుజాతను కేబినెట్ నుంచి తప్పించవచ్చునని అంటున్నారు. పితాని సత్యనారాయణ పేరు రేసులో ఉంది. అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యంకు మండలి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. కాబట్టి పితానికి అనుమానం అంటున్నారు. బీజేపీ మంత్రి మాణిక్యాల రావుకు ఢోకా లేదు.

జలీల్ ఖాన్‌కు ఛాన్స్ దక్కేనా?

జలీల్ ఖాన్‌కు ఛాన్స్ దక్కేనా?

కృష్ణా జిల్లా నుంచి మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కామినేని శ్రీనివాస రావు (బీజేపీ) సేఫ్. కొల్లు రవీంద్రను మాత్రం తొలగించవచ్చునని అంటున్నారు. రేసులో బుద్ధా వెంకన్న, బోండా ఉమ, జలీల్ ఖాన్, కాగితపు వెంకట్రావులు రేసులో ఉన్నారు.

రావెల కిషోర్ బాబు అవుట్?

రావెల కిషోర్ బాబు అవుట్?

గుంటూరు నుంచి మంత్రి రావెల కిషోర్ బాబుకు ఎర్త్ ఖాయమంటున్నారు. పత్తిపాటి పుల్లారావు భవితవ్యానికి డోకా లేదంటున్నారు. రేసులో నక్కా ఆనంద రావు, డొక్కా మాణిక్యవర ప్రసాద రావు, యరపతినేని, దూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి ఉన్నారు. స్పీకర్ కోడల శివప్రసాద రావు కూడా ఉన్నారు.

సోమిరెడ్డి వర్సెస్ బీదా..

సోమిరెడ్డి వర్సెస్ బీదా..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్రల మధ్య పోటీ నెలకొంది. ఎక్కువగా సోమిరెడ్డికి ఛాన్స్ దక్కనుందని అంటున్నారు.

ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా రాఘవ రావు తీరుపై కొంత అసంతృప్తి ఉందని, కానీ ఆయనకు మాత్రం ఎలాంటి డౌట్ లేదంటున్నారు.

అఖిల ప్రియకు ఛాన్స్

అఖిల ప్రియకు ఛాన్స్

కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి వంటి వారికి ఎలాంటి ఢోకా లేదు. వైసిపి నుంచి వచ్చిన అఖిల ప్రియకు కేబినెట్లో చోటు దక్కనుంది.

బీసీ కోటాలో..

అనంతపురం నుంచి పరిటాల సునీతకు ఎలాంటి డౌట్ లేదు. పల్లె రఘునాథ్ రెడ్డి పరిస్థితి చెప్పలేని విధంగా ఉంది. బీసీ కోటాలో పార్థసారథి పేరు తెరపైకి వచ్చింది. కాల్వ శ్రీనివాసులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

లోకేష్ ఖాయం.. అమర్నాథ్ రెడ్డికి ఛాన్స్ దక్కేనా?

లోకేష్ ఖాయం.. అమర్నాథ్ రెడ్డికి ఛాన్స్ దక్కేనా?

చిత్తూరు జిల్లా నుంచి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించడం ఖాయమంటున్నారు. నారా లోకేష్‌కు కేబినెట్లో చోటు దక్కడం ఖాయం. అలాగే, అమర్నాథ్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఆదికి చోటు దక్కేనా... కడప జిల్లాపై ఎలా?

ఆదికి చోటు దక్కేనా... కడప జిల్లాపై ఎలా?

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నేత బీటెక్ రవి గెలిచారు. వైయస్ కుటుంబానికి కడప పెట్టని కోట. అలాంటి చోట స్వయంగా వైసిపి నుంచి పోటీ చేసిన జగన్ బాబాయ్ ఓడిపోయారు. ఇది టిడిపిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కడపలో మరింత బలంగా తయారయ్యేందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వారికి కేబినెట్లో చోటు ఇవ్వవచ్చునని అంటున్నారు.

ప్రతి జిల్లా నుంచి మంత్రివర్గంలో తప్పనిసరిగా ఒకరు ఉండాలని భావిస్తే కడప జిల్లా నుంచి ఒకర్ని తీసుకునే అవకాశం లేకపోలేదు. వైసిపి నుంచి వచ్చిన వారిలో ఒకరికంటే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చేట్టయితే చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డి పేరు పరిశీలనకు రావొచ్చని భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu will reshuffle his cabinet on April Second.
Please Wait while comments are loading...