జగన్ వైపు వెళ్లకుండా చెక్: ఆనంకు కీలక బాధ్యతలు, రెండు విధాలా లాభం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆనం సోదరులు (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపించాయి. ఎమ్మెల్సీ పదవిపై వారు ఆశలు పెట్టుకున్నారు. కానీ అది కుదిరేలా లేదు.

బాబుకు మరో షాక్, ఆ పదవి కోసం పట్టు: జగన్ వైపు ఆనం బ్రదర్స్?

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు వారిని మరోలా కూల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన కలల ప్రాజెక్టును ఆనం రామనారాయణ రెడ్డి భుజాలపై పెట్టనున్నారు. రామనారాయణ ఫైనాన్స్, ప్లానింగ్‌లో మంచి దిట్ట.

ఒక్క దెబ్బకు..

ఒక్క దెబ్బకు..

ఓ వైపు ఆనం సోదరులకు ప్రధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే వారు వైసిపి వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దానికి చెక్ పెట్టవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు తన కలల ప్రాజెక్టుకు ఆనం రామనారాయణ న్యాయం చేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బాధ్యతలను ఆయనకు కట్టబెట్టాలని భావిస్తున్నారు. చంద్రన్న బీమా, ఎన్టీఆర్ హౌసింగ్.. ఈ రెండు ప్రాజెక్టుల బాధ్యతను ఆనంకు అప్పగించాలని చంద్రబాబు దాదాపు నిర్ణయించారు.

Chandrababu Naidu Survey Report on Ministers
మొదట అలా అనుకున్నప్పటికీ

మొదట అలా అనుకున్నప్పటికీ

తొలుత ఈ ప్రాజెక్టు బాధ్యతలు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అప్పగించాలని చంద్రబాబు భావించారు. చీఫ్ సెక్రటరీ, ఇద్దరు రిటైర్డ్ అధికారులకు అప్పగించాలనుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పర్యవేక్షణను ఒకరికి అప్పగించాలని మంత్రివర్గ సభ్యులు చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఈ బాధ్యతలను ఆనంకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఆయన పర్యవేక్షణలో ముగ్గురు అధికారులు వీటిని చూడనున్నారు.

వీరికి అప్పగించాలని..

వీరికి అప్పగించాలని..

అక్టోబర్ నుంచి దీనిని అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం రెండుసార్లు భేటీ అయి, చర్చించారు. చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, మాజీ సెక్రటరీలు అజయ్ కల్లం, ఎస్పీ టక్కర్‌ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే దినేష్ కుమార్ తన పనితీరుతో చంద్రబాబు మన్నన పొందుతున్నారు.

ఆనం అయితే బాగుంటుంది

ఆనం అయితే బాగుంటుంది

అయితే, చంద్రబాబుకు దగ్గరగా ఉండే కొందరు నేతలు, కేబినెట్ మంత్రులు.. ఆనం రామనారాయణ పర్యవేక్షణలో బాగుంటుందని సూచించారని తెలుస్తోంది. ఆనం ఫైనాన్స్, ప్లానింగ్‌లో దిట్ట. కాబట్టి చంద్రబాబు కలల ప్రాజెక్టులను ఆయన చేతిలో పెడితే బాగుంటుందని చెప్పారని తెలుస్తోంది.

ఇప్పుడు ఆనం సేవలు చాలా అవసరం

ఇప్పుడు ఆనం సేవలు చాలా అవసరం

ప్రస్తుత పరిస్థితుల్లో ఆనం రామనారాయణ రెడ్డి సేవలు చాలా అవసరమని నేతలు... చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉన్నాయని, ఆయనకు అధికారులతోను సత్సంబంధాలు ఉన్నాయని కాబట్టి ఆనం బెస్ట్ అని చెప్పారని తెలుస్తోంది. ప్రభుత్వానికి, లబ్ధిదారులకు మధ్య ఆనం ఓ బ్రిడ్జిలా పని చేయడంలో సఫలమవుతారని చెప్పారని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Minister Anam Ramnarayan Reddy is likely to get the responsibility of monitoring the CM’s dream schemes like Chandranna Bima and NTR housing. The CM initially wanted to hand over the responsibility to three IAS officers, two retired, apart from the Chief Secretary. However, senior Cabinet colleagues suggested that people should not think that the schemes are under the control of the administration and hence it was decided by the CM to entrust the responsibility to Mr Anam Ramnarayan Reddy. There will, however, be three bureaucrats in the system to assist the former minister.
Please Wait while comments are loading...