బాబును చిరాకు పెడ్తున్న సౌండ్స్, ఎలా చేయాలని ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడుకు సచివాలయ కార్యాలయంలో రణగొణ ధ్వుల సమస్య ఎదురైంది. ఆయన కార్యాలయానికి ఓ వైపు తెలుగుతల్లి ఫ్లై ఓవర్, రహదారి ఉంది. చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌తో పాటు మంత్రివర్గ సమావేశం నిర్వహించే హాలుకు కూడా ఈ ఫ్లై ఓవర్ దగ్గరగా ఉంది.
దీంతో ఈ ఫ్లై ఓవర్, రహదారి పైన వెళ్లే వాహనల నుండి వచ్చే ధ్వనులు, హారన్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రితో పాటు అధికారులకు కూడా ఈ ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి, వీడియో కాన్ఫరెన్స్‌తో పాటు మంత్రివర్గ సమావేశం నిర్వహించే మందిరాలకు సౌండ్ ప్రూఫ్ అద్దాలు అమర్చాలని నిర్ణయించారు.

ధ్వని నిరోధక (సౌండ్ ప్రూఫ్) అద్దాలతో పాటు తన కార్యాలయంలో అవసరమైన మరికొన్ని చిన్నచిన్ మార్పులు కూడా చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కాగా, దసరా పర్వదినం సందర్భంగా శుక్రవారం నాడు చంద్రబాబు తన కార్యాలయంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దసరా రోజు సెలవు దినం కావడం, కార్యాలయంలో ఎక్కువ సేపు గడపక పోవడంతో ఆ రోజు చంద్రబాబు దృష్టికి ఈ సౌండ్ అలజడి రాలేదు. అయితే, సోమవారం కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ అలజడిని గుర్తించారు.
ఈ విషయం గుర్తించిన చంద్రబాబు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పని చేయాలని, సమావేశాలు ఎలా జరపాలని మండిపడ్డారని సమాచారం. అధికారులతో మాట్లాడి సమస్యను తీర్చాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు సూచించారు.












Click it and Unblock the Notifications