దేశంలో ఏ సీఎంకు లేనంత భద్రత బాబుకు, హెచ్చరికలతో మరింత కట్టుదిట్టం
అమరావతి: దేశంలోని ఏ ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉంటోంది. ఇప్పటికే చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉంది. తాజాగా, మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
చంద్రబాబు భద్రతను ఐదుగురు అదనపు ఎస్పీలు పర్యవేక్షించనున్నారు. 290 మంది పోలీసు భద్రతను పెంచుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఈ భద్రత కొనసాగుతుంది. చంద్రబాబు భద్రత పైన రాష్ట్ర హోంశాఖ చర్చ జరిపింది.

చంద్రబాబుకు భద్రత పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఆర్థిక శాఖ భద్రతకు సంబంధించి ఎక్కడెక్కడ, ఎంతమంది ఉద్యోగులు అవసరమో.. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. సీఎంఎస్‌జీ (సీఎం సెక్యూరిటీ గ్రూప్)లో కొత్తగా 290 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వీరిని ఇంటెలిజెన్స్ కోసం వినియోగించుకోనున్నారు. ఇందులో అడిషనల్ సూపరింటెండెంట్స్ ఐదుగురు, డీఎస్పీలు ఏడుగురు, పోలీసులు 148 ఇలా మొత్తంగా 290 మందిని తీసుకుంటారు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు వింగులో ఇప్పుడు 196 మంది సిబ్బంది ఉన్నారు. కొత్తగా 290 మందిని తీసుకుంటే 486కు పెరుగుతుంది.












Click it and Unblock the Notifications