ఎన్ డి ఏ కు మద్దతు జగన్ సెల్ప్ గోల్, ప్రత్యేక హోదాపై వైసీపీకి బాబు చెక్ ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపక్ష నేత వైఎస్ జగన్ అవకాశవాదాన్ని ఎత్తిచూపాలని టిడిపి నిర్ణయించింది. అయితే తమిళనాడులో అన్నాడిఎంకె నుండి బహిష్కరణకు గురైన శశికళ పరిస్థితే తనకు వస్తోందనే భయంతోనే జగన్ అవకాశవాద రాజకీయాలకు తెరతీశాడని టిడిపి నాయకత్వం అభిప్రాయంతో ఉంది.ఈ విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని ఆ పార్టీ ముఖ్యనాయకులకు బాబు సూచించారు.అయితే అదే సమయంలో ప్రధానితో సమావేశం విషయంలో సున్నితంగా వ్యవహరించాలని బాబు పార్టీ నాయకులకు హితవు పలికారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైసీపీ అధినేత జగన్ ఈ నెల 10వ, తేదిన సమావేశమయ్యారు.అయితే ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడిపి, వైసీపీ, బిజెపి ల మధ్య మాటల యుద్దానికి కారణంగా మారింది.

ప్రధానమంత్రి మోడీతో వైసీపీ చీఫ్ జగన్ సమావేశం కావడంలో ఆంతర్యాన్ని టిడిపి ప్రశ్నిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో ఎన్ డి ఏ కు తాము సంపూర్ణ మద్దతిస్తామని జగన్ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బిజెపితో ఉన్న సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకుగాను టిడిపి నాయకత్వం వైసీపీపై ఎదురుదాడికి దిగుతోంది. ప్రత్యేకహోదా అంశంపై రాజకీయంగా వైసీపీని ఇరుకునపెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.

జగన్ సెల్ప్ గోల్

జగన్ సెల్ప్ గోల్


ప్రత్యేక హోదా విషయంలో టిడిపిని తిట్టిపోసిన వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ కు మద్దతిస్తామని ప్రకటించడం ఆ పార్టీ ఇంతకాలం చేసిన ఆందోళనలకు విలువలేకుండా చేసిందనే అభిప్రాయాన్ని టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు.అయితే జగన్ ఈ వ్యవహారంతో సెల్ప్ గోల్ చేసుకొన్నారని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. అదే తరుణంలో ఈ విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు.

బిజెపితో పొత్తు పెట్టుకొంటే వైసీపీ లాభమా నష్టమా

బిజెపితో పొత్తు పెట్టుకొంటే వైసీపీ లాభమా నష్టమా

బిజెపితో వైసీపీ పొత్తు పెట్టుకొంటే ఏ రకంగా ఉంటుందనే చర్చ కూడ సాగుతోంది. రాజకీయంగా ఆ పార్టీకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందనే చర్చ సాగుతోంది. వైసీపీకి ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు అండగా ఉంది.అయితే అదే సమయంలో బిజెపితో పొత్తు వల్ల ఆ వర్గాలు వైసీపీకి దూరమయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాన్ని కొందరు రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బిజెపితో పొత్తు కారణంగా టిడిపికి చెందిన మైనార్టీ ఓటింగ్ వైసీపీకి డైవర్ట్ అయిందనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి.

ఎంపిలతో రాజీనామాలుంటాయా?

ఎంపిలతో రాజీనామాలుంటాయా?

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఎంపిలతో రాజీనామాలు చేయిస్తామని వైసీపీ అధినేత జగన్ గతంలో ప్రకటించారు. ఎంపీలు రాజీనామా చేస్తే ఆ ప్రభావం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.అందుకే ఎంపీలతో రాజీనామా నిర్ణయాన్ని ఆ పార్టీ తీసుకొంది. అయితే జూలై మాసంలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి.అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థికి మద్దతిస్తామని వైసీపీ ప్రకటించింది.

జూన్ లోనే ఎంపీలతో రాజీనామాలను చేయిస్తే జూలైలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా మద్దతిస్తారనే సందేహాలు కూడ వ్యక్తమౌతున్నాయి. అయితే బిజెపితో సన్నిహిత సంబంధాలను ఆ పార్టీ కోరుకొంటున్నట్టుగా కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంలో ఎంపీలతో రాజీనామాలు చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అవకాశవాద రాజకీయాలకోసమే

అవకాశవాద రాజకీయాలకోసమే

ప్రధానమంత్రి మోడీతో జగన్ సమావేశమైన తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యులతో చర్చించారు. జగన్ పై ఉన్న కేసుల విషయాన్ని బాబు ఈ సమావేశంలో ప్రస్తావించారని తెలుస్తోంది.అయితే అదే సమయంలో అవకాశవాదంగా జగన్ వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. ప్రత్యేక హోదా కోసం ఏ రకంగా మాట్లాడారు. ప్రధానమంత్రితో సమావేశం తర్వాత ఏం మాట్లాడారనే విషయాలపై జనానికి వివరించాల్సిన అవసరాన్ని బాబు సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp chief Chandrababu naidu suggested to party leaders to wide publicity on Ysrcp special status agitation. how Ysrcp to misguide the people in the special status issue Tdp will explain Babu discussed latest politcial situation in the state.
Please Wait while comments are loading...