చంద్రబాబుకు ఘనస్వాగతం: నీతి ఆయోగ్ సమావేశం
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు బుధవారం స్వచ్చ భారత్ సమావేశానికి హాజరు కావడానికి బెంగళూరు చేరుకున్నారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆయన ప్రతేక వాహనంలో విధాన సౌధ చేరుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చంద్రబాబు నాయుడుకు కర్ణాటక సంప్రదాయం ప్రకారం శాలువా కప్పి మైసూరు పేటాతో ఘనంగా సన్మానించారు. ఇదే సందర్బంలో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, సిద్దరామయ్య ఆప్యాయంగా పలకరించుకున్నారు.
Glimpses from the ongoing meeting of the Sub-Group of Chief Ministers in Bangalore today. @NITIAayog pic.twitter.com/f6XpDZCPB6
— Andhra Pradesh CM (@AndhraPradeshCM) June 24, 2015 అనంతరం స్వచ్చ భారత్ సమావేశంలో పాల్గోన్నారు. స్వచ్చ భారత్ పై నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉప సంఘానికి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఉన్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మగాంధీ 150వ పుట్టిన రోజు వేడుకలు 2019 అక్టోబర్ 2వ తేది జరగనున్నాయి. అంతలోపు స్వచ్చ భారత్ కల నెరవేరాలని, అందుకు తీసుకోవలసిన చర్యల మీద ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారని తెలిసింది.
నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సింధూశ్రీ పుల్లర్, కేంద్ర గ్రామీణాభి వృద్ది శాఖ కార్యదర్శి సరస్వతి ప్రసాద్ తో పాటు పలు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి మీడియాకు కేవలం మూడు నిమిషాలు మాత్రం అనుమతి ఇవ్వడంతో కొంత గందరగోళం నెలకొంది.












Click it and Unblock the Notifications