చంద్రబాబు: ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు, యువతకు నిరుద్యోగ భృతి ఇలా...

అమరావతి: రాష్ట్రంలో టిడిపి అదికార పగ్గాలు చేపట్టి మూడేళ్ళు కావస్తోంది. రాజకీయ, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొంటూ మరింత వేగంగా ప్రజల వద్దకు వెళ్ళాలనే ఆలోచనలతో బాబు అడుగులు వేస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటై మూడు ఏళ్ళు పూర్తికావస్తోంది. మరో రెండేళ్ళలో ఎన్నికలు రానున్నాయి.అయితే ఎన్నికల సమయం నాటికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం తమ పాలనలో ఇప్పటివరకు చేసిన పనులను ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికలను ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తోంది.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యం

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యం

మూడేళ్లపాటు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో జనం బాట పట్టాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.రాష్ట్రాభివృద్దికి ప్రజల సంక్షేమం కోసం ఈ రెండు అంశాల్లోనూ స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించి వాటిని సాధించేలా అన్ని శాఖలను సమాయత్తం చేయాలనేది సిఎం ఆలోచన. ఈ లక్ష్యాలను చేరువ కావాలని మంత్రివర్గ సహచరులకు బాబు దిశానిర్దేశం చేశారు.మూడేళ్ళపాటు చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని బాబు తలపెట్టారు.

శాఖలవారీగా సమీక్షలు చేయనున్న బాబు

శాఖలవారీగా సమీక్షలు చేయనున్న బాబు

రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం ఆయా శాఖలు ఎలాంటి పాత్ర పోషించాలి, సాధించాల్సిన లక్ష్యాలేంటి? ఈ ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులేమిటి తదితర అంశాలపై చంద్రబాబునాయుడు ఈ సమావేశాల్లో ఓ స్పష్టత ఇవ్వనున్నారు. ఈ రెండేళ్ళలో అన్ని శాఖలను పరుగెత్తించి ప్రజలకు చేరువగా తీసుకెళ్ళాలని బాబు భావిస్తున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా బాబు వ్యూహాలను సిద్దం చేస్తున్నారు.ఈ మేరకు గురువారం నుండి బాబు శాఖల వారీగా సమీక్షలను నిర్వహించనున్నారు.

ఉపాధిహమీతో 20 శాఖల అనుసంధానం

ఉపాధిహమీతో 20 శాఖల అనుసంధానం

20 శాఖలను ఉపాధి హమీతో అనుసంధానం చేయనున్నారు. తద్వారా రూ,12,830 కోట్లతో ప్రణాళికలను రూచపొందించారు. గ్రామాల్లో ఐదువేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం నుండి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వరకు ప్రతి అంశంపై స్పష్టమైన లక్ష్యాలను నిర్థేశించారు.అధికారులతో సమన్వయంతో ఆయా లక్ష్యాల సాధనకు ముందుకు వెళ్ళాలని బాబు సూచించారు.

స్పష్టమైన లక్ష్యాలతో బాబు ప్రణాళిక

స్పష్టమైన లక్ష్యాలతో బాబు ప్రణాళిక

గురువారం నాడు మంత్రివర్గ సమావేశం తర్వాత మిగిలిన శాఖల వారీగా సమావేశాలు నిర్వహించారు.7న, విద్యుత్తుశాఖపై సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా, కొత్త వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు , ఎల్ఈడీ దీపాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.వ్యవసాయ శాఖ నుండి యువజన సేవల శాఖల వరకు అన్నింటిపై సమీక్ష నిర్వహించనున్నారు. యువజన సర్వీసుల శాఖ పరిధిలోకి వచ్చే నిరుద్యోగ భృతికి ఎలాంటి నిబంధనలపై కసరత్తు నిర్వహిస్తున్నారు.

సమాజసేవలో యువతను బాగస్వామ్యం చేస్తూ నిరుద్యోగ భృతి

సమాజసేవలో యువతను బాగస్వామ్యం చేస్తూ నిరుద్యోగ భృతి

యువతను ఎంతో కొంత సమాజ శ్రేయస్సు కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేస్తూ నిరుద్యోగ భృతిని ఇవ్వాలని బాబు భావిస్తున్నారు. ఇలాంటి అవకాశాలన్నింటిపై ఆయా మంత్రివర్గ సమీక్ష సమావేశాల్లో బాబు పూర్తిస్తాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మూడేళ్ళ తర్వాత పూర్థిస్తాయి మంత్రివర్గం ఏర్పడింది.సిఎం వద్ద ఉన్న శాఖలను కూడ మంత్రులకు కేటాయించారు. ఇక అభివృద్ది సంక్షేమంపై దృష్టిని కేంద్రీకరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+