ఫ్రెండ్లీ నేచర్: చంద్రబాబు బర్త్ డే విషెస్, మీరా! ఆశ్చర్యపోయా.. షాకైన వైయస్ జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు. వీడియో !

రివర్స్ అయింది, దిమ్మతిరిగేలా: ఇదీ పవన్ క్యారెక్టర్ అంటూ వైసీపీ అభిమాని! (వీడియో)

గురువారం (21-డిసెంబర్-2017) వైయస్ జగన్ పుట్టిన రోజు. 1972లో పుట్టిన ఆయనకు 45 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజా సంకల్ప యాత్రలోనే ఆయన తన పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు. ప్రజల మధ్య వేడుకలు జరుపుకున్నారు.

 శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు. జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని, మీరు సంతోషంగా, జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత జగన్ స్పందించారు. మీ శుభాకాంక్షలు నాకు ఆశ్చర్యం కలిగించాయని, ధన్యవాదాలు అని స్పందించారు.

చంద్రబాబును చూసి నేర్చుకోవాలి

చంద్రబాబును చూసి నేర్చుకోవాలి

చంద్రబాబు.. జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ట్వీట్‌పై చాలామంది స్పందించారు. చంద్రబాబు ఇలా శుభాకాంక్షలు తెలపడం మంచి రాజకీయ నాయకుని లక్షణమని కొందరు అబిప్రాయపడ్డారు. జగన్ ఆయనను చూసి నేర్చుకోవాలన్నారు.

చంద్రబాబు ట్వీట్‌కు జగన్ స్పందిస్తారా

చంద్రబాబు ట్వీట్‌కు జగన్ స్పందిస్తారా

చంద్రబాబు ట్వీట్‌కు జగన్ సమాధానం ఇస్తారో చూద్దామని చాలామంది పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాక మీకు సమాధానం ఇస్తారేమోనని కొందరు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఫ్రెండ్లీ నేచర్‌కు ఇది నిదర్శనం అని కొందరు అభిప్రాయపడ్డారు.

 భారీ కేక్ కట్ చేసిన జగన్

భారీ కేక్ కట్ చేసిన జగన్

కాగా, అనంతపురంలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ ప్రజల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. నల్లమడ క్రాస్ వద్ద 41వ రోజు ప్రజా సంకల్ప యాత్రను ఆయన ఉదయం ప్రారంభించారు. అంతకుముందు ఆయన భారీ కేక్ కట్ చేశారు. జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలలో వేడుకలు నిర్వహించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradsh Chief Minister Nara Chandrababu Naidu wishes YSR Congress Party chief YS Jagan Mohan Redy on his birth day.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి