అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడానికే విదేశాల్లో పర్యటిస్తున్నా: చంద్రబాబు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా యూరప్ తెలుగు సమాజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దావోస్‌లో జరిగే 46వ ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌కు వెళ్లిన ఆయన అక్కడి జ్యూరిచ్‌లో కొద్దిసేపు ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అక్కడి తెలుగు సంఘం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయవచ్చన్నారు.

సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి తాను దేశ విదేశాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఏపీ ఎన్‌ఆర్‌టీ పేరుతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లండన్‌, స్విట్జర్లాండ్‌కు చెందిన తెలుగు ప్రముఖులతో మాట్లాడి వారి నుంచి సూచనలు, వివిధ ప్రతిపాదనలను స్వీకరించారు.

 Chandrababu Naidu woos Swiss companies for investments in Andhra Pradesh

ఏపీలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ విధానాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచానికే నమూనాగా నిలుపవచ్చని పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు ముఖ్యమంత్రితో అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ప్రముఖులను ఆహ్వానించి ఏపీని విద్య, వైజ్ఞానిక నిలయంగా మార్చనున్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రితోపాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఎంపీ సీఎం రమేష్‌, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్ష, కార్యదర్శులు జయకుమార్‌, కారం సురేష్‌లు ఇందులో పాల్గొన్నారు. జ్యూరిక్‌లో మంగళవారం సీఎం చంద్రబాబు 11 విదేశీ పెట్టుబడి బృందాలతో వరుస సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశంలో ఏపీలో ఉన్న కాఫీ కంపెనీని తీసుకుంటామని, లేదంటే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ఎథికల్ కాఫీ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫండ్ మేనేజింగ్ రంగంలో ప్రసిద్ధిగాంచిన బీహెచ్‌ఎం కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. బయోటెక్, మెడికల్ సైన్స్, డయోగ్నొస్టిక్ మెడికల్ పరికరాల ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకు కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Tuesday invited leading Swiss companies to establish manufacturing units in the State. Naidu elaborated on business opportunities in Andhra Pradesh at an investor meet in Zurich, Switzerland, and asked Swiss firms, especially those in manufacturing sector, to invest in the souther State, AP Government's Information and Public Relations Department said in a release here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X