ఐదో రోజుల్లో నారా లోకేష్ , భువనేశ్వరి ఎన్ని వందల కోట్లు సంపాదించారో తెలుసా..?
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక సీట్లను సొంతం చేసుకోవడమే కాకుండా.. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్ మేకర్‌గా నిలిచారు. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించని రితీలో కూటమి ఘన విజయం సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.
అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు సైతం ఈసారి బద్దలైయ్యాయి. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్ షేర్ దూసుకుపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది.

జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 రూపాయిల దగ్గర ట్రెడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయి సంచలనం సృష్టించింది. ఐదు రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం పెరిగాయి. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే.అందులో భువనేశ్వరికి 24.37 శాతం, కుమారుడు లోకేష్‌కు 10.82 శాతం, కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. మనవడు దేవాన్ష్‌కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది. జూన్ 7న హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి రూ.661.25 దగ్గర ముగిసింది. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో రూ.535 కోట్లు, కుమారుడు లోకేష్ రూ.237 కోట్లు సంపాదించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వాల్వు అమాంతం పెరిగాయి.












Click it and Unblock the Notifications