వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పంద్రాగస్టు వేడుకలు-అమృతోత్సవాల వేళ శుభాకాంక్షలతో తెలుగు నేతల ట్వీట్లు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో పలువురు రాజకీయ నేతలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమదైన శైలిలో ట్వీట్లు పెడుతున్నారు. ఇందులో ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో స్వాతంత్ర్య సముపార్జనలో వీరుల త్యాగాల్ని స్మరించుకుంటున్నారు.

"75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛను సాధించి పెట్టిన స్వాతంత్య్ర సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ... నేడు మన ముందు ఆవిష్కృతం అయిన ఆధునిక భారత నిర్మాణంలో భాగస్వాములకు ధన్యవాదాలు తెలుపుదాం. అనూహ్య విజయాలతో అద్భుతంగా సాగిన గతాన్ని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్ ప్రయాణాన్ని సుసంపన్నం చేసుకుందాం.దేశ రక్షణలో ఉన్న జవాన్లకు,అన్నం పెట్టే రైతన్నకు వందనాలు తెలుపుదాం.సహజ వనరులతో,బలమైన యువతతో నిండి ఉన్న మన దేశాన్ని,ప్రపంచంలో అగ్రదేశంగా మలచుకునేందుకు మన వంతు పాత్ర పోషిద్దాం. #AzaadiKaAmritMahotsav సందర్భంగా ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుందాం. జైహింద్" అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్లు పెట్టారు.

chandrababu, nara lokesh and vijaya sai reddy independence day 2022 wishes tweets

" భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాల శుభసమయంలో భారతీయులకు, ఆంధ్రప్రదేశ్‌ సహా తెలుగుప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయపతాకం ఆవిష్కరించబడును. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సమస్తప్రజానీకానికి సర్వశుభాలు అందించాలని కోరుకుంటున్నాను." అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

"ఆంగ్లేయుల వలస పాలన నుంచి విముక్తి కల్పించి, స్వాతంత్ర్యం సాధించిన అమరులైన సమరయోధుల త్యాగాలు స్మరించుకుందాం. ఆధునిక భారత్ నిర్మాణంలో భాగమవుదాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు." అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

English summary
several telugu politicians including chandrababu, nara lokesh and vijaya sai reddy put tweets on the eve of independence day 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X