తప్పిన పెను ప్రమాదం ! పట్టాలపై చంద్రబాబు-అకస్మాత్తుగా వచ్చేసిన రైలు..!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. విజయవాడ వరదల్ని పరిశీలించేందుకు చంద్రబాబు రైల్వే ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో వేగంగా రైలు వచ్చేసింది. వెంటనే కార్యకర్తలు అప్రమత్తంగా వ్యయహరించడంతో చంద్రబాబు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో పార్టీ నేతలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

విజయవాడ వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యల్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు గత కొన్ని రోజులుగా వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ బుడమేరు వాగు ప్రవాహం పరిస్ధితి చూసేందుకు నగరంలోని మధురానగర్ కు వెళ్లారు. అక్కడే ఉన్న రైల్వే ట్రాక్ పైకి ఎక్కి బుడమేరు ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భద్రతా కూడా ఉన్నారు. అదే సమయంలో సడన్ గా ఓ రైలు ట్రాక్ పైకి దూసుకొచ్చింది.

chandrababu narrowly escaped train accident while watching budameru flood from rail track

చంద్రబాబు రైల్వే ట్రాక్ పై ఉన్న సమయంలో ట్రైన్‌ రావడంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది..ఆయన్ను అలర్ట్ చేశారు. వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు లైన్‌మెన్‌ను తీసుకువచ్చారు. ఆయన ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ అక్కడే నిలిచిపోయింది. చంద్రబాబుకు కేవలం 3 అడుగుల దూరంలో రైలు నిలిచిపోయింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక కాసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత చంద్రబాబు సేఫ్ గా ఉన్నారని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలను పరిశీలించేందుకు చంద్రబాబు బయలుదేరి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+