తెలుగువారు కలిసి ముందుకెళ్లాలని బాబు, కవిత బోనం
హైదరాబాద్: తెలుగు వారు అంతా కలిసి ముందుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆయన ఆదివారం ఉదయం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించికున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తాను గత ఇరవై ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు వారు అందరు కలిసి ముందుకెళ్లాలని, వర్షాలు బాగా కురవాలని అమ్మవారిని తాను కోరుకున్నానని చంద్రబాబు చెప్పారు.

అమ్మవారిని దర్శించుకున్న ఈటెల, నాయిని
సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, నాయిని నర్సింహా రెడ్డిలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. తెలంగాణలో బోనాలను రాష్ట్ర పండుగకా జరుపుకునే భాగ్యం ఇప్పుడు కలిగిందన్నారు. వర్షాలు కురవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.
బోనం సమర్పించిన కవిత, గీతా రెడ్డి
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు గీతా రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవితలు ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి వారు బోనం సమర్పించారు.












Click it and Unblock the Notifications