హరీశ్ ఫిర్యాదు చేస్తే మనమూ వెళ్లాలా?: దేవినేనికి బాబు ఝలక్, లేఖాస్త్రం
అమరావతి: కృష్ణా నది జలాల యాజమాన్య బోర్డు విషయంలో తెలుగు రాష్ట్రాలు , ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదం అలాగే కొనసాగుతోంది. నది జలాల పంపకం విషయంలో ఏపీ వాదనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు సోమవారం సాగునీటి శాఖాధికారులు, కొందరు ప్రజా ప్రతినిధులతో కలిసి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. కృష్ణా నదిపై తాము నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవద్దని ఆయన కోరారు.
ఓ వైపు ఢిల్లీలో హరీశ్ రావు పర్యటన కొనసాగుతుండగానే... విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జలవనరుల శాఖతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఆ శాఖాధికారులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 'మనమూ ఢిల్లీ వెళదాం. కేంద్రానికి ఫిర్యాదు చేద్దాం' అంటూ మంత్రి దేవినేని.. చంద్రబాబుకు సూచించారు. అయితే మంత్రి వాదనకు ససేమిరా అన్న చంద్రబాబు.. 'వాళ్లు వెళ్లారని, మనమూ వెంటనే వెళ్లాలా? కొద్దిగా గ్యాప్ తీసుకుని వెళదాం. అలా అయితేనే ప్రయోజనం ఉంటుంది. ఈలోగా కేంద్రంతో టచ్ లో ఉందాం' అని చంద్రబాబు చెప్పారు.

కేంద్ర మంత్రి ఉమాభారతికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికార పరిధిని ఆలస్యం చేయవద్దని ఆయన లేఖలో కోరినట్టు తెలుస్తోంది. బోర్డు అధికార పరిధి నోటిఫికేషన్‌ను ప్రకటించవద్దని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోందని, ఆయన చెబుతున్న అంశాలు విభజన చట్టాన్ని అనుసరించి లేవని చంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే అధికారాల ప్రకారమే ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలని, సెక్షన్ 87(1) ప్రకారం వివిధ ప్రాజెక్టుల నుంచి నీటిని వినియోగించుకునే హక్కు ఉందని, తొమ్మిదో షెడ్యూల్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయాలను అమలు చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకోవచ్చని ఆ లేఖలో చంద్రబాబు కోరారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications