డ్వాక్రా మహిళలకు చంద్రబాబు శుభవార్త..! కీలక ఆదేశాలు..!

ఏపీలో స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా)ను బలోపేతం చేసేందుకు చంద్రబాబు (chandrababu) ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ జరిగిన సెర్ఫ్, మెప్మా సమీక్షలో చంద్రబాబు ఈ మేరకు అధికారులకు దీనిపై దిశానిర్దేశం చేశారు.

స్వయం పేరుతో డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండింగ్ (chandrababu)

రాష్ట్రంలో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం "స్వయం" అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను సీఎం పరిశీలించారు. అధికారులు ప్రతిపాదించిన రెండు లోగోలను పరిశీలించిన సీఎం,, లోగో ఖరారుపై డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.

Chandrababu Orders Promotion of SHG Products Under Swayam Brand to Boost Market Reach

జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్

మెజార్టీ అభిప్రాయం మేరకు స్వయం లోగో ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం తెలిపారు. స్థానికంగా ఉండే మార్కెట్లే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా.. మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలన్నారు బ్రాండ్ పేరు, లోగో ఆకట్టుకునేలా ఉండాలన్నారు. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి, స్వయం అనే పేరు బాగుంటుందన్నారు. అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలని సీఎం సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+