చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు-దీపావళి తర్వాత అమల్లోకి..

ఏపీలో స్కిల్ స్కాంలో తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో 52 రోజుల తర్వాత రాజమండ్రి జైలు నుంచి విడుదలైన హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ జనసేనాని పవన్ కళ్యాణ్ కలిశారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు పవన్ భేటీలో టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో పై ప్రధానంగా చర్చించారు. త్వరలోనే ఉమ్మడిగా పది అంశాలతో మ్యానిఫెస్టో విడుదల చేసే అంశంపై మాట్లాడుకున్నారు. త్వరలో జనసేన టీడీపీ ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రెండు పార్టీల మధ్య మరింత ఎక్కువగా సమన్వయం ఉండేలా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ్టి భేటీలో చంద్రబాబు కేసులపైనా పవన్ అడిగి తెలుసుకున్నారు.

chandrababu, pawan kalyan discussed on future course of action-here are details

త్వరలో పవన్ విజయవాడ రానున్నారు. జనసేన పార్టీ నేతలతో ఆయన సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. దీపావళి తర్వాత జనంలో టీడీపీ- జనసేన వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించారు. రెండు గంటలకు పైగా బాబు పవన్ చర్చలు జరిపారు. ఇందులో
ఇసుక, మద్యంపైనా ఆందోళన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే వారంలో కరవుపై ప్రత్యేక ఆందోళన చేపట్టాలని కూడా ఇవాళ నిర్ణయించారు. గోదావరి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా పవన్ కు బాబు సూచించారు. వీలైనంత ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాల కు సంబంధించి ప్రణాళికలు రచించాలన్నారు. రెండు పార్టీల కార్యకర్తలు, దిగువ స్థాయి క్యాడర్ లో ఇబ్బందులు లేకుండా సమావేశాలు, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+