పద్మ విభూషణ్ గ్రహీతలు చిరంజీవి, వెంకయ్య నాయుడుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రశంసలు!!

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు వివిధ రంగాలకు చెందిన 132 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. ఇందులో 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కగా, ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉన్నారు.

కళా రంగంలో చిరంజీవి, పబ్లిక్ అఫైర్స్ లో వెంకయ్యనాయుడు పద్మ విభూషణ్ అవార్డులను దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడంపై సినిమా, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవికి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ పురస్కారం రావడం పైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

Chandrababu, Pawan Kalyan Praised Padma Vibhushan awardees Chiranjeevi, Venkaiah Naidu!!

ట్విట్టర్ వేదికగా ఈ మేరకు పోస్ట్ చేసిన చంద్రబాబు చిరంజీవి, వెంకయ్యనాయుడులపై తన ప్రశంసల జల్లు కురిపించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు మెగా స్టార్ చిరంజీవి తమ తమ రంగాలలో చేసిన అసమాన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు పొందినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

వీరిద్దరూ కఠోర శ్రమ, దృఢ సంకల్పం, తిరుగులేని క్రమశిక్షణతో విజయపథం వైపు బాటలు వేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని చంద్రబాబు వారి కఠోర శ్రమను, క్రమశిక్షణను కొనియాడారు.చంద్రబాబు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా పద్మ విభూషణ్ గ్రహీతలకు తన అభినందనలు తెలియజేశారు.

రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి, ఒకరికి పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. దేశం నలుమూలల నుండి ప్రతిభను, త్యాగాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మోడీ గారికి హ్యాట్సాఫ్ అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికే పద్మ విభూషణ్ గ్రహీతలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+