వెంకయ్యతో చంద్రబాబు: ఢిల్లీలోనే నరసింహన్, జగన్
న్యూఢిల్లీ: నోటుకు ఓటు కేసు వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీ తెలుగు రాజకీయాలు వేడెక్కాయి. గవర్నర్ నరసింహన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడిని కలిశారు. ఫోన్ ట్యాపింగ్‌పైనే ప్రధానమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, నరసింహన్ కూడా అదే విషయంపై ఢిల్లీ వచ్చినట్లు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నరసింహన్‌కు ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. దాంతో వ్యవహారంపై నివేదిక సమర్పించడానికి నరసింహన్ ఢిల్లీ వచ్చారని అంటున్నారు.

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు బుధవారంనాడు పలువురు కేంద్ర మంత్రులను, ప్రధానిని, రాష్ట్రపతిని కలుస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహారంపై ఆయన వారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ డీజీపీ రాముడు కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి డీజీపీ ఢిల్లీ వచ్చారు. సీఎస్ కృష్ణారావు కేంద్ర కేబినెట్ సెక్రటరీ, హోం శాఖ కార్యదర్శితో భేటీ అయి విభజన బిల్లులోని లోపాలను వివరించనున్నారు.












Click it and Unblock the Notifications