ఓటమికి కారణాలు తెలియట్లేదు అన్న చంద్రబాబువి నంగనాచి డ్రామాలు అన్న వైసీపీ కీలక నేత
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ నేతలతో సమావేశమై ఓటమికి గల కారణాలు ఇప్పటికీ అంతు చిక్కటం లేదని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు నాయుడుకు ఓడిపోతామని ముందే తెలుసనీ వైసీపీ నేత రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు . ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలుసునని ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు .

ఓడిపోతామని తెలిసే లోకేష్ తో ఎమ్మెల్సీగా రాజీనామా చేయించలేదన్న విజయసాయి
ఇక చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే లోకేశ్ చేత ఎమ్మెల్సీకి రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారని ఆరోపించారు . అంతే కాదు ఎన్నికల తర్వాత భవిష్యత్ ఇలా ఉంటుందని తెలిసే చంద్రబాబు ముందు జాగ్రత్తగా ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రమోషన్లిచ్చారని పేర్కొన్నారు . పోలింగ్ తర్వాత అప్పులు తెచ్చి మరీ కంట్రాక్లర్ల బిల్లులు చెల్లించారని చెప్పుకొచ్చారు . అన్నీ తెలిసే అన్నీ చక్కదిద్దుకునే , ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియట్లేదంటూ నంగనాచి డ్రామాలు ఆడుతున్నారని విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Recommended Video


రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబును నిలదీయాలంటూ ట్వీట్
ఇక రైతులను చంద్రబాబు మోసం చేశాడంటూ విజయ సాయి ఫైర్ అయ్యారు . రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారన్నారు . ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారు.రైతలను మభ్యపెట్టి ఇప్పుడు తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గు లేకుండా డిమాండు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాట తప్పిన చంద్రబాబును రైతులు నిలదీయాలని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు .

జగన్ పాలనలో రైతుల బతుకులు బాగు పడతాయన్న వైసీపీ కీలక నేత
రైతు భరోసా పథకం, ధరల స్థిరీకరణ నిధి, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రస్తుతం జగన్ పాలనలో రైతుల జీవితాలు బాగుపదతాయని పేర్కొన్నారు . సీఎం వైఎస్ జగన్ దార్శనికత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు . రైతుల మోముల్లో చిరునవ్వులు పూస్తాయని పేర్కొన్న విజయసాయి రెడ్డి ఏపీలో రైతాంగానికి సేద్యం ఇక పండుగ అవుతుంది అంటూ జగన్ ను కొనియాడారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications