ఏదైనా తిను.. నువ్వో రాజకీయ మాంసాహారివి: బాబుపై అంబటి రాంబాబు
సదావర్తి భూములను నారా లోకేశ్ కాజేయాలని పథకం రచించారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్: వైసీపీ నేత అంబటి రాంబాబు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. సదావర్తి భూములను నారా లోకేశ్ కాజేయాలని పథకం రచించారని ఆయన ఆరోపించారు.
ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే ఆలయ భూములను కాజేయాలనే ప్రయత్నం బట్టబయలైందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందని, దానికి సిగ్గుతో తలదించుకోవాల్సిందిపోయి చంద్రబాబు మాత్రం బుకాయించడానికే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు నీటి వినియోగంపై సాక్షి సహా అన్ని ప్రముఖ పత్రికలు వార్తలు రాశాయని, సాక్షి పత్రికలో ఒక వార్త వస్తే అది జగన్ వాదన ఎలా అవుతుందని అంబటి ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను వ్యక్తులకు అంటగట్టడం సరికాదన్నారు. తెలంగాణ పత్రికలు తెలంగాణ వాదన రాయడంలో తప్పేంటని ప్రశ్నించారు.
ఇక చంద్రబాబు ఏది తిన్నా, తమకు అభ్యంతరం లేదని అంబటి పేర్కొన్నారు. అయితే చంద్రబాబు రాజకీయ మాంసాహారి అని, రూ.లక్షల కోట్లు తింటున్న శాకాహారి అని ఎద్దేవా చేశారు. తాను స్వాతికాహారం తీసుకుంటున్నానంటున్న చంద్రబాబు.. మట్టితో పాటు ఇసుక కూడా తింటున్నారన్నారు. మట్టితో పాటు ఇసుక కూడా తింటున్నారని విమర్శించారు.
పీ రాజధాని అమరావతి డిజైన్ల కోసం సినీ దర్శకుడు రాజమౌళిని నియమించడమేంటని ప్రశ్నించారు. పాక్‌తో యుద్ధం వస్తే ఆర్మీకి బదులు హీరోలను పంపించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై తమకు అనుమానాలున్నాయని అంబటి అన్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్‌పై చంద్రబాబు అవాకులు, చవాకులు మానుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications