జగన్ కు ఊహించని అస్త్రం ఇచ్చిన చంద్రబాబు-నిద్ర లేపి మరీ..!

ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాలన తర్వాత జనం ఇచ్చిన భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోతోందన్న ఫీడ్ బ్యాక్ ఎలాగో ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ ప్రకటన గత ఎన్నికల తర్వాత పూర్తిగా కుదేలైన విపక్ష వైసీపీకి వరంగా మారబోతోంది. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత మొక్కుబడిగా పోరాటాలు చేస్తూ జనంలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్న జగన్ ను తట్టిలేపేలా ఉంది.

రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూటమి పార్టీలు ఎన్నో హామీలు ఉన్నాయి. వీటిలో సూపర్ సిక్స్ హామీలతో పాటు మ్యానిఫెస్టోలో చెప్పిన పలు అంశాలున్నాయి. అయితే ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో పూర్ రికార్డు ఉన్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి యూటర్న్ కాని యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగోలేదని గణాంకాలతో జనం ముందుకొచ్చారు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే తగిన వైద్యం చేయాల్సిందే అంటూ కథలు చెప్పడం మొదలుపెట్టేశారు.

Chandrababu s postponement of welfare schemes implementation a big boost for ys jagan

అయితే గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఇలా ఉందని చంద్రబాబుకు తెలియదా అంటే తెలుసు. అయినా భారీ ఎత్తున హామీలు ఇచ్చేశారు. అయితే చంద్రబాబు హామీల అమలు రికార్డుపై క్లారిటీ ఉన్నా అప్పట్లో జగన్ కు మరో అవకాశం ఇవ్వొద్దని భావించిన జనం కూటమికి జై కొట్టేశారు. దీంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సంక్షేమ పథకాల్లో పెన్షన్ల పెంపు హామీని మాత్రమే నిలబెట్టుకున్నారు. మిగతా హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇదిగో అదిగో అంటూ వస్తున్న చంద్రబాబు నిన్న ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఆర్ధిక పరిస్ధితి బాగుపడ్డాక పథకాలు అమలు చేస్తామని చెప్పేశారు.

మరోవైపు రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక సైలెంట్ గా ఉంటున్న వైఎస్ జగన్ తాజాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని నిరసనలకు పిలుపునిచ్చారు. రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు అమలు కావడం లేదంటూ మరో రెండు నిరసనలకు పిలుపిచ్చారు. అయితే వీటిలో వైసీపీ నేతలు, శ్రేణులు పాల్గొన్నా జగన్ మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు పథకాల అమలు వాయిదా రూపంలో ప్రభుత్వం మరో భారీ అస్త్రం జగన్ చేతికి ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే విపక్షంగా జనంలో ఉండాల్సిన జగన్ ఇంట్లోనే ఉండిపోతే ఎలా పోరాడాలి కదా అని గుర్తుచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+