Chandrababu: దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంంపు- చంద్రబాబు మరో హామీ..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల హామీల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే ఏమేం చేస్తామన్న దానిపై మ్యానిఫెస్టోల విడుదలకు ముందే పార్టీల అధినేతలు హమీలు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన పెన్షన్ల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ ఎన్డీయే కూటమిలో భాగమైన టీడీపీ అధినేత చంద్రబాబు దివ్యాంగులకు కీలక హామీ ఇచ్చారు. ప్రజాగళం సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు.
సత్తెనపల్లిలో దివ్యాంగులు తనను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారని చంద్రబాబు తెలిపారు. వారి కోరిక పై తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు చంద్రబాబు ఎక్స్ లో తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

సత్తెనపల్లిలో దివ్యాంగులు నన్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. వారి కోరిక పై తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ… pic.twitter.com/bwILWRPeoB
— N Chandrababu Naidu (@ncbn) April 8, 2024
మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశమేనని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి యేటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశామని చంద్రబాబు తెలిపారు. దివ్యాంగుల కోసం టీడీపీ అమలుచేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు ట్వీట్ లో తెలిపారు.












Click it and Unblock the Notifications