పరిస్థితి చెప్తా, రాజకీయాలు మాట్లాడను: ఢిల్లీలో బాబు

న్యూఢిల్లీ: తాను ఎవరితోను రాజకీయాలు మాట్లాడనని, రాష్ట్రంలోని తాజా పరిస్థితులు వివరించి అనుచిత పరిస్థితులు తొలగించాలని కోరుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం చెప్పారు. సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో చంద్రబాబు ఇరు ప్రాంతాల పార్టీ నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రపతి, జాతీయ పార్టీల నేతలను తాను కలుస్తానని, రాష్ట్రంలోని అనుచిత పరిస్థితిని వారికి వివరిస్తానని చెప్పారు. రాష్ట్ర పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరుతానన్నారు. తాను ఎవరితోను రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. ఈ రోజు, రేపు ఇక్కడే ఉంటామని, అందరికీ రాష్ట్ర పరిస్థితులు వివరిస్తామన్నారు.

Nara Chandrababu Naidu

కాగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, దిగజారిన ఆర్థిక పరిస్థితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసు వ్యవహారంపై ఆయన రాష్ట్రపతి, జాతీయ పార్టీల నేతలను కలువనున్నారు. ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని టిడిపి ఎంపి నామా నాగేశ్వర రావు చెప్పారు.

చంద్రబాబు వెంటే తెలంగాణ ప్రాంత నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎల్ రమణ, సీమాంధ్ర నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు, కెఈ కృష్ణమూర్తి, కోడెల శివప్రసాద్, అయ్యన్న పాత్రుడు తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+