సుప్రీం సిట్ తీర్పుపై చంద్రబాబు రియాక్షన్ ఇదే- జగన్ రిపీట్ శంఖుస్ధాపనలపై సెటైర్లు..
ఏపీలో రాష్ట్రంలో రివర్స్ పాలనతో వ్యవస్ధలన్నీ పతనమయ్యాయని విపక్ష నేత చంద్రబాబు ఇవాళ ఆరోపించారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో పాలన చేశామని, రాష్ట్రంలో వనరుల్ని ఉపయోగించుకుని 2021 కల్లా నంబర్ వన్ అవుదామని ప్రణాళికలు సిద్ధం చేశామని గుర్తుచేశారు. విజన్ 2020 అంటే విమర్శలు చేశారు. ఇప్పుడు విజన్ గురించి మాట్లాడితే విమర్శలు చేస్తున్నారన్నారు. సిట్ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు.
జగన్ సర్కార్ సిట్ దర్యాప్తు చేస్తామంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చాలా వెతికారు, ఏం జరిగింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మా అకౌంట్లలోకి ఒక్క రూపాయి కూడా రాలేదు, జగన్ షెల్ కంపెనీల అకౌంట్లలోకే డబ్బులు వెళ్లాయన్నారు.తాము క్లీన్ గా ఉన్నాం, భయపడాల్సిందేమీ లేదన్నారు. అయినా తమకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే జగన్ వదులుతారా అని ప్రశ్నించారు. విపక్షాలను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు భయపడేది లేదన్నారు.

మరోవైపు టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నాలుగేళ్లు వరుసగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని, 2016లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తున్న టాప్ త్రీ రాష్ట్రాల్లో నిలిచామని చంద్రబాబు గుర్తుచేశారు. మౌలిక సదుపాయాల్లోనూ నంబర్ వన్ స్దాయికి వచ్చామన్నారు. ప్రభుత్వ పాలన, టెక్నాలజీ అంశాల్లోనూ నంబర్ వన్ స్ధాయికి చేరామని, దావోస్ తో పాటు ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెచ్చామన్నారు.
భావనపాడు పేరు కొనసాగింపు నామోషీ కాబట్టి మూలపేటగా పేరు మార్చారని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచంలో కన్నార్పకుండా అబద్ధాలాడటంలో జగన్ నంబర్ వన్ అన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తే ఇందులో 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 5 లక్షల 13 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఈ విషయం తొలి అసెంబ్లీ భేటీలోనే అప్పటి మంత్రి గౌతం రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. విశాఖలో మూడు సీఐఐ సదస్సులు, వ్యవసాయ సదస్సులు పెట్టామని,
2019-22 వరకూ కేంద్రం ప్రకటించిన పెట్టుబడులు చూస్తే రాష్ట్రం అధోగతిలో వెళ్లిందన్నారు. 2019 అక్టోబర్ నుంచి 2022 డిసెంబర్ నుంచి దేశంలో 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే 5751 కోట్లు మాత్రమే ఏపీకి వచ్చాయన్నారు.
రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శంఖుస్ధాపన చేస్తే ఇప్పుడు మళ్లీ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్లిపోవడం మీ చేతకానితనం కాదా అని అడిగారు. బెదిరించి పరిశ్రమలను వెళ్లగొట్టారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు అవసరమా అని ప్రశ్నించిన జగన్ ఇప్పుడు వజ్రం, కిరీటం, డైమండ్ అంటున్నారన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు గతంలోనే అన్ని అనుమతులు ఇచ్చినట్లు కేంద్రం చెప్పిందన్నారు. దానికి అడ్డుపడి కోర్టుకెళ్లి ఇప్పుడు తానే అనుమతలు తెచ్చానంటున్నారన్నారు. గతంలోనూ కియా మోటార్స్ కు భూములు తిరిగి ఇచ్చేస్తానన్న జగన్ ఇప్పుడు మా నాన్నే తెచ్చారంటున్నారని విమర్శించారు.

ఇప్పుడు ప్రపంచం ఏపీని చూసి భయపడుతోందని, ఇక్కడ పాలించే వ్యక్తుల్ని బట్టి ఈ నిర్ణయానికి వస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంతవరకూ మీరు తెచ్చిన పరిశ్రమ ఒక్కటి ఉంటే చెప్పమని ప్రశ్నించారు. ఉపాధి కల్పన, గ్రాడ్యుయేట్ల తయారీ విషయంలోనూ ప్రభుత్వం వెనుకబడిందని విమర్శించారు. కాలేజీలపై కోపంతో విద్యాసంస్ధల్ని కంట్రోల్ చేశారు. ఫలితంగా 70 వేల మంది విద్యార్ధులు తెలంగాణ వెళ్లి ఎంసెట్ రాశారు. అక్కడి మంత్రి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
జగన్ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ల మీద ప్రతీరోజూ మాట్లాడుతున్నారు, దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు అంటున్నారని చంద్రబాబు విమర్శించారు. రజనీకాంత్ వస్తే ఆయనపైనా విరుచుకుపడుతున్నారు. ఓ సూపర్ స్టార్ హైదరాబాద్ చూసి మాట్లాడుతున్నారు. రజనీ ఇప్పుడు చెప్పారు, మన్మోహన్, బిల్ క్లింటన్ ఎప్పుడో చెప్పారు. వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ చూసి వచ్చానన్నారు. అప్పుడు అభివృద్ధి చూడటానికి పోటీ పడి వచ్చారు. ప్రశ్నిస్తే కుట్రదారుడు, వెన్నుపోటుదారుడు అంటున్నారు. ఎవడికి కావాలి మీ కథలు. ఇంటికి స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. మీ మొహానికి 6093 స్టిక్కర్ తగిలించుకుని తిరగాలన్నారు. తాను మాట్లాడితే కాపుల్ని పెట్టి తిట్టిస్తున్నారని, పవన్ ను కూడా తిట్టిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications