చర్చిద్దాం: కేసీఆర్‌కి బాబు, ఇప్పటికే ఎక్కువైంది.. వేయం
హైదరాబాద్: ఆర్థిక పరిస్థితి పైన శ్వేత పత్రం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో గల సమస్యల పైన కూడా స్పందించారు. సమస్యల పైన ఇరు రాష్ట్రాలు చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. చట్టంలో అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణకు మిగులు బడ్జెట్ తన కారణంగానే వచ్చిందన్నారు. యూపీఏ చేసిన విభజన వల్ల రెండు ప్రాంతాల ప్రజలు నష్టపోయారన్నారు. విభజన పద్ధతి ప్రకారం జరగలేదన్నారు. విభజన వల్ల ఇబ్బందులను ప్రజలకు చెప్పామన్నారు. విద్యుత్ సమస్యలు వస్తాయని ముందే చెప్పామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఎక్కువ.. ఆదాయం తక్కువగా కనిపిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉందన్నారు. పద్ధతి ప్రకారం జరపని రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు ఎక్కవవగా ఉందన్నారు.
పన్నులు పెంచలేం
ఇప్పటికే పన్నులు విపరీతంగా ఉన్నాయని... ఇంకా పన్నులు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేయలేమని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications