తిరుమల లడ్డూపై విచారణకు సిట్ -టీమ్ లో అధికారులు వీరే..!

తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేశారన్న సీఎం చంద్రబాబు ఆరోపణల నేపథ్యంలో రాజకీయంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాల నిర్ధారణ, చర్యల కోసం ప్రభుత్వం ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో పలువురు సీనియర్ ఐపీఎస్ లను సభ్యులుగా నియమించింది. తక్షణం సిట్ విచారణ ప్రారంభించనుంది.

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సిట్ కు అధిపతిగా గుంటూరు రేంజ్ డిఐజి సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే సీట్ డీఐజీగా విశాఖ రేంజ్ డీఐజీ గోపి నాథ్ జెట్టిని నియమించారు. సీట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు వ్యవహరిస్తారు. వీరితో పాటు మరికొందరు సీఐలు, ఎస్సైలు కూడా సెట్ లో ఉండబోతున్నారు.

Chandrababu regime appoints SIT on Tirumala laddu row

వీరు తిరుమలలో కల్తీ నెయ్యిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోళ్ల కోసం టీటీడీ తీసుకున్న నిర్ణయాలు, వాటికి ఎప్పుడు ఆమోదం లభించింది, లడ్డూ కల్తీ వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్న వైనంపై సిట్ దర్యాప్తు చేపట్టనుంది. అనంతరం బాధ్యులపై ప్రభుత్వానికి చర్యలు సిఫార్సు చేయనుంది. దీంతో సిట్ చేపట్టబోయే దర్యాప్తు కీలకంగా మారింది. ఇప్పటికే వైసీపీ నేతలు దీన్ని ఖండిస్తున్న నేపథ్యంలో సిట్ విచారణలో వీరిపై దర్యాప్తు ఉంటుందా లేదా తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+