కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొనకొండలో ఏముంది, ఆ మధ్యనే: రాజధానిపై బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్ర రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తోసిపుచ్చారు. శుక్రవారం కర్నూలులో జరిగిన ఆంధ్ర రాష్ట్ర తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన కొద్ది మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దొనకొండలో రాజధాని ఏర్పాటు సాధ్యం కాదన్నారు.

అక్కడ సామాజిక మౌలిక సదుపాయాల వ్యవస్థ, నగర జీవితం లేదని చంద్రబాబు అన్నారు. ఒక రాజధానిని ఏర్పాటు చేయాలంటే ఈ రెండు అంశాలు అవసరమన్నారు. సామాజిక మౌలిక సదుపాయాలు, నగర జీవితం దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రంలో నడిబొడ్డున గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని ఏర్పాటుకు అవసరమైన ప్రాతిపదిక ఉందన్నారు.

Chandrababu Naidu

దొనకొండలో విస్తారమైన భూమి తప్ప ఇంకేముందని చంద్రబాబు అడిగారు. దొనకొండకు సమీపంలో ఒక్క నగరమైనా ఉందా? పైగా మారుమూల ప్రాంతం, మెట్టప్రాంతమని అన్నారు. ఇటువంటిచోట రాజధానిని ఎలా నిర్మించగలమని ఆయన ప్రశ్నించారు. రాజధాని అంటే కేవలం కార్యాలయాల సముదాయం కాదని, ఒక అపురూపమైన నగరంగా ఎదగాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

కడప జిల్లా ఇడుపులపాయలో ఐఐఐటి, వెటర్నరీ రీసెర్చి స్టేషన్ ఉన్నాయని, కానీ అక్కడ వెళ్లి పనిచేసేందుకు ఒక ఫ్యాకల్టీ, రీసెర్చర్ ఆసక్తి చూపడం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రీకరణ ఉండదని, వికేంద్రీకరణ ఉంటుందన్నారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉన్నా, అభివృద్ధి మాత్రం రాష్టమ్రంతా విస్తరింప చేస్తామన్నారు.

అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకృతం చేసే అవకాశం లేదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అన్ని శాఖల డైరెక్టరేట్లు, కమిషనరేట్లను విజయవాడకు తాత్కాలికంగా తరలించనున్నట్టు చెప్పారు. పోర్టులు, ఐటి పరిశ్రమలను ఏర్పాటు చేయడం తమ ముందున్న లక్ష్యమని చంద్రబాబు వివరించారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that Donakonda is not ideal place for Andhra Pradesh capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X