ఇక జగన్ స్ధానంలో రాజముద్ర..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చే పట్టాదారు పాసుపుస్తకాలపై తొలిసారి సీఎం జగన్ ఫొటో ముద్రించారు. అంతకు ముందు వీటిపై ప్రభుత్వ రాజముద్ర ఉండేది. దాన్ని తీసేసి కోట్లాది రూపాయల ఖర్చుతో జగన్ ఫొటోల్ని ప్రింట్ చేశారు. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. దీంతో కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే తిరిగి రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ ఫొటోతో ఉన్న పాస్ పుస్తకాల స్ధానంలో కొత్తగా అధికారిక రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను తయారీకి ఆర్డర్ చేసింది. ఇప్పుడు ఇవి ప్రభుత్వానికి అందాయి. త్వరో వీటిని రైతులకు అందించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు వీటిని చూపించారు. రాజముద్రతో కనిపిస్తున్న పాస్ బుక్ ను చంద్రబాబు పట్టుకుని ప్రదర్శించారు.

మరోవైపు రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు చేసిన సమీక్షలో పెండింగ్ ఇళ్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై చర్చించారు. ఏపీ వ్యాప్తంగా భూఅక్రమాలపై విచారణకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు ఇచ్చింది. దీంతో రెవెన్యూ శాఖ ప్రతిపాదనలపై ప్రభుత్వం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణకు సిద్దమవుతోంది. అలాగే మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో జరిగిన తరహా అక్రమాలు చాలా చోట్ల జరిగాయని ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. వీటిపై త్వరలో విచారణ ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications