ఎవరు చెప్పినా: బాబు ఆర్థిక శ్వేతపత్రం, విభజన పైనా..

హైదరాబాద్: గత పదేళ్లలో ఆర్థిక రంగం కుదేలైన కారణాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివరించే ప్రయత్నం చేశారు. ఆర్థిక శాఖ పైన ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ముందు తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు.

ఆర్థిక సంస్కరణల తర్వాత వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. 2007 తర్వాత దేశం తిరోగమనం ప్రారంభమైందన్నారు. 2004 వరకు ఆర్థిక రంగం బాగుందని, ఆ తర్వాతే పతనం ప్రారంభమైందన్నారు. యూపీఏ హయాంలో పన్నులు విపరీతంగా పెంచేశారని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు.

గత పదేళ్లలో విద్యుత్ పైన పెట్టుబడులు పెట్టకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. నీటి పారుదల పైన 94వేల కోట్లు ఖర్చు పెట్టినా ఏం సాధించలేకపోయారని ఆరోపించారు. 2001 నుండి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. పదేళ్లలో తలసరి ఆదాయం రూ.2,266 నుండి 7,136కు పెరిగిందన్నారు.

Chandrababu releases white paper on finance

రుణాల రీషెడ్యూల్‌కు ఆర్బీఐ గవర్నర్ అంగీకరించారని, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ పైన తాను హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు. అలాగే డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని కూడా నెలబెట్టుకుంటానని, దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటామన్నారు.

విభజన పైన...

విభజన ఒక పద్ధతి ప్రకారం జరగక పోవడం వల్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం తగ్గిందని చెప్పారు. విభజన వల్ల ఇబ్బందులను ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేశానని చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం తగ్గి.. అప్పు పెరిగిందన్నారు. కాంగ్రెసు పార్టీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు.

విద్యుత్ రంగం పైన పెట్టుబడులు పెట్టలేదని, దూరదృష్టి లేకుండా విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ... అభివృద్ధి, సుపరిపాలన దిశగా సాగుతున్నామన్నారు. అభివృద్ధి కోసం ఎవరు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. తమ హయాంలో అక్షరాస్యత శాతాన్ని పెంచుతూ జనాభా నియంత్రణకు చర్యలు తీసుకున్నామన్నారు. పదేళ్లలో అప్పులు 5.75 శాతం పెంచారన్నారు.

అక్టోబర్ 2 నుండి గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. 2001 అక్షరాస్యతా శాతం 16.37 కాగా ఇప్పుడది 6.3 శాతానికి చేరిందన్నారు. చేశారన్నారు. టెండర్లు, ప్రాజెక్టులకే పరిమితమయ్యారు తప్ప అభివృద్ధి పైన దృష్టి సారించలేదన్నారు. ఆర్థిక సంస్కరణలకు ముందు కూడా ఏపీ వ్యవసాయ రంగం బాగుండేదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే పెట్టుబడుల పైన దృష్టి సారిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+