5రాష్ట్రాలు: బిజెపివైపు బాబు అడుగు, జగన్‌పై పరోక్షంగా

 Chandrababu responds on four states results
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండగా, కాంగ్రెసు పార్టీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. 10 జన్‌పథ్ చేతిలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ అయ్యారని ధ్వజమెత్తారు. యూపిఏ హయాంలో అన్ని ధరలు పెరిగాయని, అవినీతి పెచ్చరిల్లిందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. కాంగ్రెసు పార్టీకి నాలుగు రాష్ట్రాల్లోను పరాభవం తప్పదన్నారు. సుపరిపాలనకు టిడిపి చిరునామా అని, ముందస్తు వస్తే కాంగ్రెసు పోతుందన్నారు.

అవినీతి, అభివృద్ధి చేయని పార్టీలను ప్రజలు అంగీకరించరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోను కాంగ్రెసు పార్టీకి కోలుకోలేదన్నారు. సుస్థిర, నీతివంతన పాలనకు ప్రజలు ఓటేశారన్నారు. అవినీతితో జైల్లో ఉండేవారిని బయటకు తీసుకు వచ్చారని, కాంగ్రెసు దేశాన్ని పాలించే హక్కు కోల్పోయిందన్నారు. మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశానికి కాంగ్రెసు పార్టీ శని పోతోందని, ఈ ఫలితాలను కాంగ్రెసు కూడా స్వాగతించాలన్నారు.

కాగా, నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో బిజెపి రెండింట అధికారం దిశగా పరుగులు పెడుతుండగా, ఢిల్లీలో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుస్థిరత, నీతివంతమైన పాలనకు ప్రజలు ఓటు వేశారని చెప్పడం గమనార్హం. అదే సమయంలో మోడీని ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్నారు. తద్వారా ఆయన బిజెపికి దగ్గరవుతున్నారా అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన పరోక్షంగా స్పందించారు. కాంగ్రెసు అవినీతిని ప్రజలు తిరస్కరించారని, వచ్చే ఎన్నికల్లోను అవినీతిపరులకు ఇదే పరాభవం తప్పదని పరోక్షంగా జగన్ పార్టీని ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+