రైతులను ఉసిగొల్పుతున్నారు: చంద్రబాబు
ప్రభుత్వంపై కొందరు లేనిపోని ఆరోపణలను చేస్తున్నారని, కావాలనే రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అవినీతిపరుల సభలకు వెళ్తే ప్రజలకే నష్టమన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే నేతలు పట్టిసీమ అవసరం లేదన్నారని, ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేశారన్నారు.శుక్రవారం గొల్లపల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాయలసీమకు నీళ్లిస్తానని ఎన్టీఆర్ చెప్పారని, ఆయన కల నెరవేర్చినందుకు ఆనందంగా ఉందన్నారు. 226 కి.మీ దూరం నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ కు నీళ్లు తెచ్చామన్న ఆయన.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే అనంతపురానికి నీటి కొరత ఉండదన్నారు. అదేవిధంగా సముద్రంలోకి వృథాగా పోతోన్న గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని చెప్పారు.












Click it and Unblock the Notifications