జాతీయ నేతల చుట్టూ తిరిగే దుస్థితి చంద్రబాబుకు వచ్చింది దాడి వీరభద్రరావు ఫైర్

చంద్రబాబు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమన్నారు వైసీపీ నేత దాడి వీరభద్రరావు.గతంలో ఎన్టీఆర్ చుట్టూ జాతీయ నాయకులు తిరిగేవారని, ఇప్పుడు, జాతీయ నేతల చుట్టూ చంద్రబాబు తిరిగే దుస్థితి వచ్చిందని దాడి వీరభద్రరావు విమర్శించారు. ఏపీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారని మండిపడ్డారు . చంద్రబాబు సర్కార్ లక్ష శాతం ఓటమిపాలవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన దాడి వీరభద్రరావు ఓడిపోవడం ఖాయమని తెలిసే దేశమంతా తీర్ధయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. పిలవని పేరంటానికి చంద్రబాబు నాయుడు వెళ్లడమే కాకుండా తాను ఏదో సాధించేస్తానని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవుతుందని తెలిసి దొంగ సర్వేలతో పబ్బం గడపాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు .

 Chandrababu revolving around national leaders .. Daadi Veerabhadrarao fire

కాంట్రాక్టులకు కక్కుర్తిపడి చంద్రబాబుకు అనుకూలంగా లగడపాటి తన సర్వే ఇచ్చారని ఆరోపించారు.చంద్రబాబు అందరి దగ్గరకు వెళ్లి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, తెలుగు ప్రజల పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు దాడి వీరభద్రరావు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+