వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడపడుచులను దూషించటం ఆరాచక పాలనకు నాంది - మనసు కలిచివేసింది : జూ ఎన్టీఆర్ ఎమోషనల్...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఘటన..చంద్రబాబు రోదన...అంశం పైన ప్రముఖ సినీ హీరో..జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆయన ఈ అంశం పైన మాట్లాడుతూ తన అభిప్రాయం స్పష్టం చేసారు. ప్రతీ మనిషి మాట్లాడే మాట వారి వ్యక్తిత్వాన్ని తెలిచయేస్తుందన్నారు. రాజకీయాల్లో విమర్శలు..ప్రతివిమర్శలు సహజమే అయినా అవి ప్రజా సమస్యలపైనే ఉండాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు సరికాదని జూనియర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనసును కలిచివేసిందని చెప్పారు.

అరాచక పాలనకు నాంది అవుతుంది

అరాచక పాలనకు నాంది అవుతుంది

సమస్యలన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు.ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఆరాచక పాలనకు నాందిగా అభివర్ణించారు. అది తప్పని స్పష్టం చేసారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అని..మన సంప్రదాయమని చెప్పుకొచ్చారు. మన నవ నాడుల్లో, రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయమని చెప్పారు. మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు జాగ్రత్తగా అప్పగించాలని సూచించారు. తాను వ్యక్తిగత దూషణ కు గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాట్లాడటం లేదని..ఇక కుమారుడుగా.. ఇక భర్తగా..ఒక తండ్రిగా.. ఇక భారతీయుడిగా మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.

రాజకీయ నేతలు ఇలాంటివి ముగించాలి

రాజకీయ నేతలు ఇలాంటివి ముగించాలి

రాజకీయ నేతలు ఇలాంటివి ముగించాలని తారక్ కోరారు. రాబోయే తరాలకు బంగారు బాట వేయాలని..ఇలాంటి ఇంతటితో ఆగిపోతాయని కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసారు.
ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు బాలక్రిష్ణ..రామక్రిష్ణతో సహా ఎన్టీఆర్ కుమార్తెలు సైతం ఈ అంశం పైన స్పందించారు. భువనేశ్వరి పైన అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ రామక్రిష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. మరోసారి నందమూరి ఆడపడుచుల గురించి వ్యాఖ్యలు చేస్తే నందమూరి మరో రూపం చూస్తారంటూ వారంతా హెచ్చరించారు. ఇప్పటి వరకు చంద్రబాబును చూసి తాము కంట్రోల్ అవుతున్నామని..ఇక, చంద్రబాబు చెప్పినా వినమని..ఏ వ్యవస్థ అపినా...బద్దలు కొట్టుకొని వస్తామని బాలయ్య హెచ్చరించారు.

నందమూరి కుటుంబం సీరియస్

నందమూరి కుటుంబం సీరియస్

తాము గాజులు తొడుక్కొని కూర్చోలేదని..ఖచ్చితంగా స్పందిస్తామని..మిమ్మల్ని మీరు కాపాడుకోమంటూ హెచ్చరించారు. నందమూరి కుటుంబ సభ్యులు సైతం మంత్రి కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. అంబటి రాంబాబు.. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తమ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈ సారి మాట జారితే ఖబడ్దార్ అంటూ కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు కళ్యాణ్ రాం సైతం ఈ ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ తాము భువనేశ్వరికి అండగా ఉన్నామని చెప్పుకొచ్చారు. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ స్పందనతో ఈ వ్యవహారం మరింతగా చర్చకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.

English summary
Chandrababu Row: Junior NTR Reacts says that not to get the family members into politics and asks to stop the bad culture
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X