చంద్రబాబు మూడు రోజుల సమ్మర్ వెకేషన్ .. ఫ్యామిలీతో సిమ్లాకు వెళ్తున్న చంద్రబాబు
Recommended Video
జగన్ స్విట్జర్లాండ్‌కూ... చంద్రబాబు సిమ్లాకు...! || Oneindia Telugu
ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. అయినా రాజకీయ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. మండుతున్న ఎండలతో పాటు రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా వుంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు వర్సెస్ సీఎస్ , ఈసీ అన్న చందంగా పరిస్థితి ఉంది. ఒకపక్క ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికలు ముగిశాక రెస్ట్ మూడ్ లోకి వెళ్తే సీఎం చంద్రబాబు మాత్రం నిన్నటి దాకా ఈసీపై , సీఎస్ పై తన తిరుగుబాటు కొనసాగిస్తూనే ఉన్నారు.

నేడు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లనున్న సీఎం ఫ్యామిలీ, తిరిగి సోమవారం నాడు అమరావతి చేరుకోనుంది. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తదితరులు వెళ్లనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి మూడు రోజుల ఫ్యామిలీ ట్రిప్ లో చంద్రబాబు కాసింత రాజకీయాలను పక్కన పెట్టి ఫ్యామిలీతో గడపనున్నారు.












Click it and Unblock the Notifications