కోవిడ్ బాధితుల కోసం చంద్రబాబు సాధన దీక్ష , డిమాండ్స్ ఇవే.. రేపు ఆందోళనలకు టీడీపీ పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సర్కార్ అవినీతిపై, ప్రజలను మోసం చేస్తున్న విధానాలపై సమరశంఖం పూరించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ వైఫల్యాలపై విరుచుకుపడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు రేపు కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో సాధన దీక్ష పేరుతో ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నారు.
Recommended Video
ఈ క్రమంలో నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయవాడకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో రేపు దీక్షకు దిగుతున్నట్లుగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు నిరసన దీక్ష చేపట్టనున్నారని, ఆయనతో పాటు 15 మంది పార్టీ సీనియర్ నేతలు ఈ దీక్షలో పాల్గొంటారని అచ్చెన్నాయుడు వివరించారు.

సాధన దీక్ష పేరుతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ తమ జిల్లా కేంద్రాలలో ఆందోళన నిర్వహించనున్నారు. కరోనా బాధితులను ఆదుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రతరం చేస్తామని చంద్రబాబు దీక్షతో నైనా ప్రభుత్వంలో చలనం రావాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు అమరావతి లోని విద్యాసంస్థల్లో చదివిన తొలి బ్యాచ్ విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చాయి అని పేర్కొన్న చంద్రబాబు నాయుడు అమరావతి దక్షిణ భారత దేశ విద్యా కేంద్రంగా మార్చాలని తమ విజన్ అని తెలిపారు. తమ విజన్ ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని, అమరావతి ప్రాంత లో చదువుకున్న విద్యార్థులు ఈ ఏడాది 50 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాలు సాధించాలని, ప్రముఖ యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు అత్యుత్తమ రీతిలో ఎదగాలని తాను ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications