6 రాష్ట్రాల్లో పోటీ, సీమాంధ్ర వద్దు!: బాబు, కెసిఆర్‌పై ఫైర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్ర అని పలికేందుకు ఆసక్తి చూపలేదు. హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీమాంధ్ర అన్నారు.
అంతలోనే సీమాంధ్ర పేరు సరికాదని, రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని, దానినే ఉపయోగించుదామన్నారు. విభజన అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని తాను డిమాండ్ చేశానన్నారు. ఎపికి న్యాయం చేసి ప్రజలను ఆదుకోవాలని తాను సూచించానన్నారు.

తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యోగాలు, పోలవరం పేరుతో సమస్యలు సృష్టించాలనుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు న్యాయం చేయడం టిడిపి బాధ్యత అన్నారు. టిడిపి రెండు రాష్ట్రాలలో ఉందన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం టిడిపి బాధ్యత అన్నారు.
తెలంగాణ, సీమాంధ్రల్లో టిడిపి ఉందని, శాశ్వతంగా ఉంటుందన్నారు. తెలంగాణకు న్యాయం చేసే పార్టీ టిడిపి మాత్రమేనని చెప్పారు. తనకు కార్యకర్తలకు ఉన్న సంబంధాన్ని ఎవరు చెరపలేరన్నారు. తనకు కార్యకర్తలే ఆస్తి అన్నారు. అవసరమైతే కార్యకర్తల వెల్ఫేర్ కోసం నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పారు.
కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. పార్టీలో సమర్థ నాయకత్వం ఎక్కడ ఉన్నా వెతికి పైకి తీసుకు వస్తానని చెప్పారు. టిడిపిని జాతీయ పార్టీగా చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ఆరు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications