టీడీపీని ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతాం; కమీషన్ వేసి శిక్షిస్తాం: కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారంనాడు రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు కుప్పం ప్రాంతీయ ఆసుపత్రి లో ఆక్సిజన్ ప్లాంట్ ను చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు. టిడిపిని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. మరో రెండేళ్ల తర్వాత రాష్ట్రానికి మరోసారి సీఎం అవుతానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

 ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతా

ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతా

సీఎం కాగానే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతానని చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే కమీషన్ ఏర్పాటు చేసి మరీ వారిని శిక్షిస్తామని, తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే అని పేర్కొన్న చంద్రబాబు ఏ తప్పు లేకున్నా టీడీపీ కార్యకర్తలను, నేతలను ఇబ్బందులు పెట్టిన వారికి శిక్షపడేలా చేయడంలో తప్పు లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రం వైసీపీ జాగీరా ? మీకు రాష్ట్రాన్ని రాసిచ్చారా?

రాష్ట్రం వైసీపీ జాగీరా ? మీకు రాష్ట్రాన్ని రాసిచ్చారా?

ఇక ఇదే సమయంలో వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డ చంద్రబాబు రాష్ట్రం వైసీపీ జాగీరా? మీకు రాష్ట్రాన్ని రాసిచ్చారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రాష్ట్ర వినాశకుడుగా మారాడని చంద్రబాబు తిట్టిపోశారు. తాను కుప్పం వదిలి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించిన చంద్రబాబు వీళ్లకు తాను భయపడనని తేల్చిచెప్పారు. ఐదేళ్ల పాలన అంటే చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి కానీ, అందరూ తిట్టుకునేలా కాదని చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేశారు.

కుప్పం నుంచి అరాచక పాలనకు చరమగీతం పాడాలి

కుప్పం నుంచి అరాచక పాలనకు చరమగీతం పాడాలి

తాను మంచి విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి నాశనం చేసిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంక్షేమ పథకాలకు సంబంధం ఉందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం నుంచి అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు అని పేర్కొన్న చంద్రబాబు వైసిపి కార్యకర్తలను ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అని తేల్చి చెప్పారు.

పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేసిన చంద్రబాబు

పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేసిన చంద్రబాబు


ఇక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అంతు చూస్తామని పదే పదే వెల్లడిస్తున్న చంద్రబాబు, టిడిపి నేతలు తప్పుడు కేసులు పెట్టిన అధికారులు లెక్కలు తీస్తున్నామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని, లెక్కలు తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చంద్రబాబు కేసుల విషయంలో భయపడుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మరోమారు తప్పు చేసిన వారిని తప్పక శిక్షిస్తామని వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ కొత్త బిచ్చగాడు వంటి పార్టీ

వైసీపీ కొత్త బిచ్చగాడు వంటి పార్టీ

నలభై సంవత్సరాలుగా దేశ రాజకీయాలలో ప్రత్యేక ముద్ర వేసిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొని వైసీపీ కొత్త బిచ్చగాడు వంటి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలతో పొత్తులనేవి రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకోవడం జరుగుతుందని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. వైసీపీకి ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశం ఇక అయిపోయిందని జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+