నిధులివ్వడం లేదు: మోడీపై బాబు అసహనం, జగన్‌కు 20 శాతం ఆఫర్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chandrababu Naidu unhappy with Modi మోడీపై బాబు అసహనం, జగన్‌కు 20 శాతం ఆఫర్ | Oneindia Telugu

  అమరావతి: కేంద్రంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీకి నిధులు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

  బాబు బెదిరించారు, అమరావతికి రుణమిస్తే ఆత్మహత్య: ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు హెచ్చరిక

  కేంద్రం ఇవ్వలేదని ఇంట్లో కూర్చోలేం

  కేంద్రం ఇవ్వలేదని ఇంట్లో కూర్చోలేం

  కేంద్రం ఇచ్చే నిధులు ఆలస్యమవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.14వేల కోట్లకు పైగా ఏపీకి రావాల్సి ఉందని, వాటిని ఇంకా ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని మనం ఇంట్లో కూర్చోలేం కదా అని చంద్రబాబు అన్నారు. మన ప్రయత్నం మనం చేయాలన్నారు.

  ప్యాకేజీ రావాలి

  ప్యాకేజీ రావాలి

  కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మనకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఇంకా నిధులు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి అయిదేళ్లలో రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్లు రావాలన్నారు. కేంద్రం నిధులు సకాలంలో రాకపోయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని, వాటిద్వారా లోటు వర్షపాతం ఉన్నప్పటికీ స్థిరత్వం సాధించగలిగామన్నారు.

  జగన్ అలా చేస్తే సమస్య పరిష్కారం

  జగన్ అలా చేస్తే సమస్య పరిష్కారం

  వైయస్ జగన్ తన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని, 2004లో ఆయన కలిగి ఉన్న ఆస్తులపై గరిష్ఠంగా 20 శాతం అదనంగా ఉంచుకుని మిగతా వాటిని ఇచ్చేయాలని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. ఇలా చేయడంవల్ల ఒకేసారి సమస్య పరిష్కారమైపోతుందని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

  అన్నింటి పైనా చర్యలు

  అన్నింటి పైనా చర్యలు

  మోసానికి పాల్పడిన అగ్రిగోల్డ్‌, కేశవరెడ్డి తదితర సంస్థల ఆస్తులు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నాయని, ఇదే తరహాలో జగన్‌ తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌, కేశవరెడ్డి సహా మోసకారి సంస్థలు వేటినీ విడిచిపెట్టేది లేదన్నారు.

  సుభాష్ చంద్రకు సూచించా

  సుభాష్ చంద్రకు సూచించా

  అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేయడానికి జీ గ్రూపు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని చంద్రబాబు అన్నారు. ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర ఇటీవల తనను కలిసి ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకరిస్తామని, అయితే ముందు డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేసేలా చూడాలని సూచించానని వెల్లడించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Friday said that YSR Congress Party chief YS Jaganmohan Reddy should return his assets to government soon.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి