అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనూహ్యం- చంద్రబాబు వీడియో తీసిన అసెంబ్లీ మార్షల్-పట్టుకున్న సెక్యూరిటీ- క్షమాపణ

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తొలిరోజు మహిళా సాధికారతపై అధికార వైసీపీ చర్చ చేపట్టింది. దీనికి విపక్ష టీడీపీ బాయ్ కాట్ చేసింది. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినా సభకు మాత్రం హాజరుకాలేదు. దీంతో సీఎం జగన్ కూడా ఆయన్ను పదే పదే కలవరించడం కనిపించింది. ఇవాళ రెండోరోజు టీడీపీ సభలో అడుగుపెట్టింది.

రెండోరోజు అసెంబ్లీ సమావేశాల కోసం టీడీపీ సభలో అడుగుపెట్టేందుకు వస్తున్న సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శాసన సభ ప్రాంగణంలో ఓ అసెంబ్లీ మార్షల్ ఓవర్ యాక్షన్ చేశాడు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలోకి వెళ్తున్న సమయంలో మార్షల్ ఫోన్‌తో విజువల్ షూట్ చేశాడు. దీంతో మార్షల్ తీరుపై చంద్రబాబు సెక్యూరిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సదరు మార్షల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

chandrababu security personal caught assembly marshal for shooting video at him in assembly

ఏపీ అసెంబ్లీలో ఫోన్ తో వీడియో తీస్తున్న అసెంబ్లీ మార్షల్ ను చంద్రబాబు సెక్యూరిటీ అదుపులోకి తీసుకున్నారు. వీడియో తీయడానికి గల కారణాలను తెలుసుకున్నారు. అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో సెక్యూరిటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సదరు అసెంబ్లీ మార్షల్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పాడు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. ఆ తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి వెళ్లారు. అయితే ఈ ఘటనపై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే శాసనసభలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించాలని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ప్రోటోకాల్ కలిగిన విపక్ష నేత చంద్రబాబుకు అసెంబ్లీ ప్రాంగణంలోనే భద్రత లేదనే అంశాన్ని వారు ప్రస్తావించనున్నారు.

మరోవైపు ఇవాళ అసెంబ్లీ రెండోరోజు సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. ఇందులో వ్యవసాయ రంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి కన్నబాబు ప్రసంగం చేస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో వారికి కన్నబాబు సమాధానాలు చెప్తున్నారు. టీడీపీ హయాంలో పరిస్ధితులతో ప్రస్తుత పరిస్ధితుల్ని పోలుస్తూ కన్నబాబు సెటైర్లు వేస్తున్నారు.

English summary
ap opposition leader chandrababu's security caught a assemly marshal while shooting video today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X