డిస్టర్బ్ చేసి, సరైన పాలన అందించకుండా కుట్ర: ఓటుకు నోటుపై బాబు
కడప: ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను డిస్టర్బ్ చేసి, సరైన పాలన అందించకుండా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ప్రతిపక్షాలు ప్రతి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. తన పైన అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు తనను ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన వ్యాఖ్యలు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నట్లుగా తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు ఇటీవల మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కారణం. ఆయన కోర్టుకు వెళ్లడంతో కోర్టు మరోసారి స్పందించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటే: రఘువీరా
కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటేనని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి గురువారం వేరుగా అన్నారు. ప్రత్యేక హోదా పైన మాట్లాడుతూ... హోదా విషయంలో మరోసారి కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేయవద్దన్నారు.
వినేవాళ్లు ఉంటే స్వాతంత్ర్యం కూడా తానే తెచ్చానని చంద్రబాబు చెబుతారని ఎద్దేవా చేశారు. రెయిన్ గన్‌ల విషయమై చంద్రబాబుకు ఆయన ఈ వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చారు. కరువు విషయం తెలియదని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. బాబు డాష్ బోర్డు కరువును గుర్తించలేదా అని ప్రశ్నించారు. రేపటి భారత్ బందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications