వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇచ్చిన మాట ప్రకారం: రైతు నాగేశ్వరరావు కూతుళ్లకు ఎన్టీఆర్ ట్రస్ట్ అడ్మిషన్.. లెటర్ పంపిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు కూతుళ్లకు విద్య అందిస్తానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇచ్చిన మాట ప్రకారం వెన్నెల, చందనకు ఉచిత హాస్టల్ సదుపాయంతో కూడిన అడ్మిషన్ లెటర్‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ పంపించింది. చంద్రబాబు ఆదేశాల మేరకు రైతు నాగేశ్వరరావుకు అడ్మిషన్ లెటర్ పంపించింది. తమ కూతుళ్ల విద్య కోసం సాయం చేసిన చంద్రబాబు నాయుడికి ఆ కుటుంబం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. సోనూ సూద్ సర్, చంద్రబాబు సర్.. తమ సమస్యలను తీర్చారని నాగేశ్వరరావు తెలిపారు.

విద్యను అందిస్తా..

విద్యను అందిస్తా..

చిత్తూరు జిల్లా మహల్ రాజుపల్లి గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావుకు ఆర్థిక స్తోమత లేదు. అతను అంతకుముందు మదనపల్లెలో టీ స్టాల్ పెట్టుకొని నడిపించేవాడు. అయితే కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల ఉపాధి లేకుండా పోయింది. దీంతో పిల్లలతో సహా స్వగ్రామం చేరుకున్నారు. వ్యవసాయం చేయడానికి ఎడ్లు కూడా లేకపోవడంతో.. కూతుళ్లతో పొలం దున్నిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఆ నోట ఈ నోట.. ప్రపంచానికి తెలిసింది. సోషల్ మీడియా ద్వారా సోనూసూద్ తెలుసుకొన్నారు.

ట్రాక్టర్.. ఎడ్యుకేషన్

ట్రాక్టర్.. ఎడ్యుకేషన్

రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ పంపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రైతు నాగేశ్వరరావు కూతుళ్ల విద్యకు సహకరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ ట్రస్ట్ చదివించేందుకు ముందుకొచ్చింది. ట్రస్ట్‌కు చెందిన మహిళా కాలేజీలో ఉచిత హాస్టల్ సదుపాయంతో కూడిన అడ్మిషన్ ఇస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు పంపించిన ఆ లేఖలో ట్రస్ట్ పేర్కొన్నది. ట్రస్ట్ కాలేజీలో కాదంటే.. సొంతూరిలో గల కాలేజీలో చదవాలనుకుంటే ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. కాలేజీ ఫీజు ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తుందని వెల్లడించారు.

Recommended Video

Sonu Sood Help to AP Farmer With Tractor
నాగేశ్వరరావు ఫ్యామిలీ హ్యాపీ

నాగేశ్వరరావు ఫ్యామిలీ హ్యాపీ

చంద్రబాబు అందించిన సాయంపై నాగేశ్వరరావు ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది. ఇక తనకు ఏ చింత లేదని ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్‌తో పొలం దున్ని చక్కగా వ్యవసాయం చేసుకుంటానని తెలిపింది. అయితే తాను ఊరికే చేశానని.. సరదా కోసం చేశానని వస్తోన్న వార్తలను నాగేశ్వరరావు ఖండించారు. అలాంటిదేమీ లేదు అని.. కొందరు కావాలనే అలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

English summary
chandrababu send admission letter to farmer nageshwar rao for his children education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X