అధికారి మైండ్ బ్లాంక్?, సార్ ఇది అన్యాయమంటూ: బాబు ప్రశ్నకు ఇలా..
97శాతం ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే ఆనందించాల్సిందిపోయి.. మిగతా మూడు శాతానికి ఏమైందని ప్రశ్నించడం అన్యాయమని అమాయకంగా బదులిచ్చారట.
విజయవాడ: సర్వేలతో జనం నాడి పట్టుకోవాలని చూడటం ఏపీ సీఎం చంద్రబాబుకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. పథకాలు, పార్టీ తీరు, ప్రభుత్వ కార్యాచరణ.. ఇలా ప్రతీ అంశాన్ని జనం వైపు నుంచి తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే చేయించారు.
ఇటీవలే ఆ సర్వే ఫలితాలను సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణమోహన్ చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుందని చెబుతున్నారు. పెన్షన్ల విషయంలో 97 శాతం మంది లబ్దిదారులు సంతోషంగా ఉన్నారని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలినట్లు కృష్ణమోహన్ సీఎంతో అన్నారట.

అయితే సంతోషం వ్యక్తం చేస్తారనుకున్న సీఎం కాస్త.. అదేంటి 100శాతం రావాలిగా? అనేసరికి ఆయన నోట మాట రాలేదట. 97శాతం ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే ఆనందించాల్సిందిపోయి.. మిగతా మూడు శాతానికి ఏమైందని ప్రశ్నించడం అన్యాయమని అమాయకంగా బదులిచ్చారట. కృష్ణమోహన్ బిక్క మొహాన్ని చూసి చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండిపోయారట.












Click it and Unblock the Notifications