టీడీపీ ఎమ్మెల్యేలకు టైం టేబుల్ ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు రాష్ట్ర ప్రజల మెప్పు కోసం శత విధాల కృషి చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నప్పటికీ, సంపద సృష్టి కోసం అనేక కొత్త కార్యక్రమాలను చేపడుతున్నారు.
ప్రజల మెప్పు కోసం చంద్రబాబు కొత్త నిర్ణయం
ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును పొందాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా అనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తన రాజకీయ చతురతను చూపిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యేలు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేలకు టైం టేబుల్ ఇచ్చి పని చేయించాలని నిర్ణయించారు.

48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఇటీవల ఆదేశం
తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పార్టీ పైన దృష్టి సారించిన చంద్రబాబు అనేకమార్లు పలువురు ఎమ్మెల్యేలకు తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు .ఇటీవల 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో కొంతమంది ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొనడం లేదని, అలసత్వం ప్రదర్శించే ఎమ్మెల్యేలకు నోటీసుల ద్వారా తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తూనే వారి వివరణ తీసుకోనున్నారు.
ఎమ్మెల్యేలకు టైంటేబుల్ రూపొందిస్తున్న చంద్రబాబు
ఎమ్మెల్యేలు తన చుట్టూ కాకుండా, ప్రజాక్షేత్రంలో ప్రజలు చుట్టూ తిరగాలని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మంచిపనిని ప్రజలకు వివరించాలని, ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మార్గనిర్దేశం చేశారు. తాజాగా ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే మరో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేలకు టైంటేబుల్ రూపొందించినట్టు తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్యేలు ప్రతినెలా ఒకటవ తేదీ క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా సామాజికభద్రతా పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.
ప్రతీ నెల ఎమ్మెల్యేలకు షెడ్యూల్ ఇలా
ప్రతినెల 5వ తేదీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని, ఆ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, విద్యా తదితర అంశాలను పరిశీలించాలని టైం టేబుల్ లో రూపొందించారు. అంతేకాదు ప్రతి నెల పదవ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యేలు భోజనం చేయాలని, అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న భోజనం ఏ విధంగా ఉంటుందో వారు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు కూడా తెలిసేలా చేయాలని నిర్ణయించారు.
టైం టేబుల్ లో ఈ కార్యక్రమాలు తప్పనిసరి
ప్రతి నెల 15వ తేదీన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయాలని, 20వ తేదీన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ, టిడిపి కార్యకర్తల బీమాకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని, 25వ తేదీన నియోజకవర్గంలోని ఎమ్మార్వో కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయాలని టైం టేబుల్ రూపొందించినట్టు తెలుస్తోంది .
నెలలో ఒకరోజు ఒక గ్రామంలో పాదయాత్ర
అలాగే నెలలో ఒకరోజు తప్పనిసరిగా ఏదో ఒక గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. ఈ టైం టేబుల్ తూచా తప్పకుండా ప్రతి ఎమ్మెల్యే పాటించాలని టిడిపి అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రజల మెప్పు కోసం చంద్రబాబు చేసే ఈ అపర చాణక్యం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో తెలియాల్సి ఉంది.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications