పెట్టుబడులు ప్రామాణికం కాదు..దావోస్ టూర్ పై చంద్రబాబు షాకింగ్..!
తాజాగా దావోస్ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అక్కడ విశేషాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన తాము అక్కడ ఎవరెవరితో భేటీ అయ్యామో వివరించిన చంద్రబాబు.. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో వైఫల్యంపై వస్తున్న విమర్శలపై పరోక్షంగా స్పందించారు. పెట్టుబడుల కంటే వివిధ దేశాల నేతలు, పారిశ్రామిక వేత్తలతో భేటీ అయి నెట్ వర్కింగ్ , బ్రాండ్ మార్కెటింగ్ చేసుకోవడమే కీలకం అన్నారు.
దావోస్ తనకు కొత్త కాదని, ఈ దేశంలో దావోస్ కు వెళ్లాలని నిర్ణయించి ట్రెండ్ సెట్ చేసింది తానే అన్నారు. 1995 నుంచి దావోస్ కు వెళ్లడం మొదలుపెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. దావోస్ ధనికులు ఉండే ప్రాంతమని, అక్కడికి వెళ్లేందుకు భారతీయులు వెంటనే ఆసక్తి చూపేవారు కాదని, కానీ తాను వెళ్లడం మొదలుపెట్టాక ఎస్ఎం.కృష్ణ వంటి నేతలు రావడం మొదలుపెట్టారన్నారు. బిల్ గేట్స్ కూడా మీరు ఇప్పుడు ఏపీని ప్రమోట్ చేస్తున్నారు కదా అని తనతో అన్నట్లు చంద్రబాబు తెలిపారు.

నాలుగోసారి సీఎం అయ్యాక మళ్లీ దావోస్ వెళ్లి కొత్త బ్రాండ్ ను ప్రమోట్ చేయాల్సి వస్తోందని చంద్రబాబు తెలిపారు. గతంలో కూలిపోయిన ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. దావోస్ లో 27 వన్ టూ వన్ మీటింగ్స్ అయ్యాయని, నాలుగు రౌండ్ టేబుల్ భేటీలు, మూడు కాంగ్రెస్ సెషన్స్, ఓ ఐరాస హ్యాబిటేట్ భేటీ అయ్యిందన్నారు. మంత్రులు లోకేష్, భరత్ 37 మీటింగ్స్ కు హాజరైనట్లు తెలిపారు.
దావోస్ పర్యటన గురించి ప్రజలకు వివరించటానికి, ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా. 1995లో మొదటి సారి సియం అయిన దగ్గర నుంచి, దావోస్ కి వెళ్లి, ఏపి బ్రాండ్ గురించి వివరించటం మొదలు పెట్టాను. #AndhraIsBack#InvestInAP#APatWEF#WEF25#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/ppT4Lv5sIc
— Telugu Desam Party (@JaiTDP) January 25, 2025
గతంలో హైదరాబాద్ ను తాను ఎలా అభివృద్ధి చేశానో అందరికీ తెలుసన్న చంద్రబాబు.. ఇప్పుడు దావోస్ లో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఎక్కువగా ప్రయత్నించినట్లు వెల్లడించారు. సీఐఐతో కలిసి సింగపూర్ లోని ఐఎంబీని కలుపుకొని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మిగతా దేశాల్లో చాప్టర్‌లు ఉంటాయన్నారు. దావోస్ అంటే అందరు ఎన్ని ఎంవోయూలు చేశారని అడుగుతారని, కానీ అది ప్రామాణికం కాదని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. దావోస్‌లో నాలుగు రోజులు ప్రపంచం మొత్తం వస్తుందని, అక్కడ మనం నెట్ వర్కింగ్ చేసుకోవాలన్నారు. అక్కడ అనేక మంది సీఈఓ లు, కంపెనీల అధిపతులు వచ్చి అక్కడ భేటీ అయ్యారని తెలిపారు. వీరందరినీ కలవాలంటే అన్ని దేశాలకు వెళ్లాలన్నారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications